Mar 25,2023 22:25

ఆసరా సాయం మెగా చెక్కును అందిస్తున్న కలెక్టర్‌ బసంత్‌కుమార్‌

     పట్టపర్తి అర్బన్‌ : జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌ ఆసరా మూడో విడత కింద లబ్ధిదారులకు రూ.216.55 కోట్లు సాయం అందిందని కలెక్టర్‌ ఎస్‌.బసంత్‌కుమార్‌ తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ భవనంలో జిల్లా స్థాయి వైఎస్సార్‌ ఆసరా నగదు బదిలీ కార్యక్రహాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 28,127 సంఘాల్లోని 2,77,574 మంది సభ్యులకు రూ.216.55 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. వైఎస్సార్‌ ఆసరా పథకం వల్ల మహిళా సాధికారత మరింత మెరుగుపడి, గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోని స్వయం సహాయక సంఘాల్లోని పేద మహిళల యొక్క ఆర్థిక పురోభివద్ధికి దోహదపడుతుందన్నారు. అనంతరం మెగా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్కలిగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నళిని, పుడా వైస్‌ ఛైర్మన్‌ లక్ష్మీనరసమ్మ, మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ శ్రీలక్ష్మి, డీఆర్డీఏ పీడీ నరసయ్య, రంగే గౌడ మండల సమాఖ్య అధ్యక్షురాలు పుష్పలత, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.