ప్రజాశక్తి - వేంపల్లె : ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌లో తన తండ్రి, కీ.శే. వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డికి శనివారం ఘనంగా నివాళులర్పించారు. ఇడుపులపాయి వ్యవసాయ క్షేత్రంలోని గెస్ట్‌హౌస్‌లో బస చేసిన సిఎం 9.30 గంటలకు వైఎస్‌ఆర్ ఘాట్ వద్దకు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి చేరుకున్నారు. అక్కడ వైఎస్‌ఆర్ ఘాట్‌కు పూలమాల వేసి నివాళులర్పించారు. సమీపంలోని వైఎస్‌ఆర్ విగ్రహానికి సిఎం పూలమాల వేశారు. అక్కడే చర్చికి వెళ్లి క్రిస్మస్ కేక్‌ను కట్ చేశారు. తల్లి విజయమ్మ, సతీమణి భారతిరెడ్డితో పాటు బంధువులతో కలిసి రెండు గంటల పాటు కిస్మిస్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనలు పూర్తి అయిన తర్వాత క్రిస్మస్ వేడుకలకు వచ్చిన బంధువులను, స్నేహితులను పేరు పేరునా పలకరించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.










