Apr 30,2023 21:41

ప్రచారం చేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-నెల్లూరు :సిపిఎం, సిపిఐ కేంద్ర కమిటీ పిలుపు మేరకు రూరల్‌ సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో '' ప్రచార బేరి ''కార్యక్రమం వైఎస్‌ఆర్‌ నగర్‌ సెంటర్‌ ప్రాంతంలో ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ప్రచార కార్యక్రమం చేపట్టారు. సిపిఎం రూరల్‌ కమిటీ సభ్యులు కండె కోటేశ్వరరావు మాట్లాడుతూ 8 సంవత్సరాలు అధికారంలో ఉన్న మతోన్మాద బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేస్తుందన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, బ్యాంక్‌, బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎల్‌ఐసి, ప్రైవేటు రంగ సంస్థలకు అప్పగించేందుకు వేగంగా ప్రయత్నాలు చేస్తుందన్నారు. దేశంలో కార్మిక వర్గం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను హరించే విధంగా మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరించడం పట్ల కార్మికుల్లో ఆందోళన నెలకొంటుందన్నారు. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వనీ గద్దె దింపాలని దేశాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక సిపిఎం నాయకులు వాసుదేవరావు ప్రకాష్‌ ,ఉమాల్‌ సాహుల్‌ ,నారాయణ తదితరులు పాల్గొన్నారు