Feb 22,2023 22:19

మెగా చెక్కును అందజేస్తున్న పీడీ

ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్‌ : వైఎస్‌ఆర్‌ లా నేస్తం కింద జిల్లాలో 20 మంది యువ అడ్వకేట్లకు రూ. 15.35 లక్షల లబ్ధి చేకూరిందని డిఆర్‌డిఎ పీడీ నరసయ్య పేర్కొన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో ఈ పథకం కింద 2022 సంవత్సరానికి అర్హులైన యువ న్యాయవాదులకు పీడీ నరసయ్య మెగా చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ కొత్తగా న్యాయవాద వత్తిలో ప్రవేశించిన న్యాయవాదులు వృత్తిలో స్థిరపడేవరకు మొదటి మూడు సంవత్సరాల పాటు నెలకు రూ. 5 వేలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం డివిజన్‌ అభివృద్ధి అధికారి శివారెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.