Dec 29,2022 18:49

బీమా నగదు అందజేస్తున్న ఇంటూరి మాధవరావు

ప్రజాశక్తి -కందుకూరు : కందుకూరు చంద్రబాబు సభలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన కొండముడుసు పాలెం గ్రామానికి చెందిన కలవకూరి యానాదికి వైఎస్‌ఆర్‌ బీమా పథకం రూ.5.లక్షలు మంజూరైంది. ప్రస్తుతం మట్టి ఖర్చుల నిమిత్తం తక్షణ సాయం రూ.10000 సాయాన్ని కందుకూరు మండలం ఎంపిపి భర్త ఇంటూరి మాధవరావు గురువారం అందజేశారు. సచివాలయ సిబ్బంది, ఎస్‌సి కాలనీ వైసిపి నాయకులు కె.మల్లికార్జునరావు, సిహెచ్‌.జయమ్మ, వాలంటీర్‌ శ్రీకాంత్‌ ,పి.కోటేశ్వరరావు ,కె.సుబ్బారావు, యం.మధుబాబు తదితరులు మతిని కుటుంబానికి సంతాపం తెలిపారు.