ప్రజాశక్తి-హెల్త్ యూనివర్శిటీ: నగరానికి చెందిన ప్రముఖ మానసిక వైద్యులు డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. గురువారం తిరుపతిలోని విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ రాజారెడ్డి, హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రారెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈసదర్భంగా గౌరవ డాక్టరేట్ పొందిన సందర్భంగా డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డిని నగరానికి చెందిన పలువురు వైద్యులు అభినందించారు.










