Jan 17,2023 21:35

ఫొటో : వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

వైద్యులు అందుబాటులో ఉండాలని వినతి
ప్రజాశక్తి-ఉదయగిరి : వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని డిడిఒ లీలావతికి మంగళవారం సిపిఎం మండల కార్యదర్శి ఫర్థిన్‌ బాషా, మన ఫౌండేషన్‌ సభ్యులు బాబు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్సిటల్‌లో నూతనంగా నలుగురు వైద్యులు నియామకం చాలా సంతోషించామన్నారు. ఈ మారుమూల ప్రాంతంలో ఉన్న నిరుపేద రోగులకు మంచి వైద్యం అందుతుందని ఆనందం వ్యక్తం చేశామన్నారు.
కాని దానికి విరుద్ధంగా వైద్యులు ఎవరుకూడా పూర్తి సమయం వైద్యశాలలో అందుబాటులో లేక అత్యవసర పరిస్థితులలో వచ్చిన దూరంతాలైన ఆత్మవారు, నెల్లూరు వైద్యశాలలకు వెళ్లమని సలహాలు ఇవ్వడంతో అనేక మంది పేద ప్రజలకు సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారని వివరించారు. కావున వైద్యశాలలో వైద్యులందరూ తమ సమయాన్ని 9:00 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విధి నిర్వహణలో ఉండి పేదలకు వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు.