ప్రజాశక్తి -తిరువూరు
జనవిజ్ఞానవేదిక (జెవివి)తిరువూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక నాగార్జున ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వ హించిన బి.పి, షుగర్ రోగుల రెగ్యులర్ వైద్యశిబిరానికి విశేష స్పందన లభించింది. ఉమ్మడి కష్ణా జిల్లా నుండే కాకుండా సరిహద్దునున్న ఖమ్మం, ఏలూరు జిల్లాల నుండి హాజరైన సు మారు 1300 మంది రోగులను న్యూరాలజిస్ట్ రాజేశ్వరి, డాక్టర్ వి.ర వీంద్రతో పాటు పలువురు వైద్యులు పరీక్షించి రెండు నెలలకు సరిపడ మం దులు ఇన్సులిన్ లను అందజేశారు. వీరికి జెవివి వాలంటీర్లు సేవలందించా రు. ఈకార్యక్రమంలో జెవివి నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నా రు.










