Feb 05,2023 21:51

ఫొటో : వైద్యం చేస్తున్న ఎం వి రమణయ్య

వైద్య శిబిరానికి విశేష స్పందన
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఆత్మకూరు పురపాలక పరిధిలోని షిరిడి సాయిరాం కళాశాల ఏర్పాటు చేసిన వైద్య శిబిరం విశేష స్పందన లభిస్తుందని డాక్టర్‌ ఎమ్‌.వి. రమణయ్య తెలిపారు. జెట్టి శేషారెడ్డి, మెమోరియల్‌ ట్రస్ట్‌ జెవివి నాయకులు పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలని దృఢ సంకల్పంతో ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. పేద ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. గ్రామాల నుండి అనేకమంది ఈ వైద్య శిబిరానికి తరలిరావడం ఆత్మకూరు జన విజ్ఞాన వేదిక శాఖ కృషి చేస్తుందన్నారు.
సుమారు 100 మంది వైద్య పరీక్షలు నిర్వహించుకొని వైద్యం పొందినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ అనూష వైద్య పరీక్షలు నిర్వహించారు. జెవివి జిల్లా నాయకులు హరికృష్ణ, అధ్యక్షుడు వంటేరు మల్లికార్జున, ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ, కామయ్య, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సంధాని, కృష్ణప్రసాద్‌, కృష్ణమోహన్‌, తదితరులు పాల్గొన్నారు.