Jun 12,2023 20:55

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

 రాయచోటి : జిల్లాలో ఎన్‌సిడి-సిడి సర్వే వందశాతం లక్ష్యాలను సాధిం చాలని కలెక్టర్‌ గిరీష వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశిం చారు. సోమ వారం కలెక్టరేట్‌లో వైద్య శాఖకు సంబంధించిన అంశాలపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ జిల్లాలో రక్తహీనతలతో బాధపడుతున్న వారిని గుర్తించి ఎప్పటి కప్పుడూ రక్త పరీక్షలు నిర్వహించి రక్తహీనత నివారణకు కషి చేయా లన్నారు. ఇంటి వద్దకే వైద్య సేవలు -ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ కార్యక్ర మంలో భాగంగా డయాబెటిస,్‌ హైపర్‌ టెన్షన్‌ రోగులకు తరచూ వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలో అతిసార ఉధతి నివారణకు తీసుకున్న చర్యలపై వైద్యాధికారులతో సమీక్షించారు. అతిసార వ్యాధి నివారణకు వారి, జింక్‌ వాడకంపై అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలకు విరేచనాలు అవుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆశా, ఎఎన్‌ఎం, ఆరోగ్య కార్యకర్తలు తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ డిఐఒ డాక్టర్‌ ఉషశ్రీ, వైద్యాధికారులు పాల్గొన్నారు.
సంతప్తికర స్థాయిలో పరిష్కరించండి
జగనన్నకు చెపుదాం కార్యక్రమంలో భాగంగా స్పందన దర ఖాస్తుల మీద దష్టి సారించి వాటిని సంతప్తికర స్థాయిలో పరిష్క రించాలని, ఎలక్షన్స్‌కు సంబంధించిన పెండింగ్‌ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని హౌసింగ్‌ కి సంబంధించిన ఇకెవైసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్‌ మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి స్పందన, రీ సర్వే, ఎలక్షన్స్‌, హౌసింగ్‌, గ్రామ వార్డు సచివాలయాలు, సంపూర్ణ పోషణ తదితర అంశాలలో జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహ శీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపిడిఒలు, ఎస్‌హెచ్‌ఓలు, గహ నిర్మాణ శాఖ అధికారులు, ఎపిఎంలు, ఎపిఒలు, సిడిపివోలు, మండల సర్వే యర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర ్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలీసు శాఖ వారికి వచ్చే దరఖాస్తులలో సివిల్‌ గొడవలు ఉంటే అటువంటి సమస్యలకు తగిన విధంగా దరఖాస్తులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖలలో రీఓపెన్‌ అయిన అర్జీలపై ఆయా శాఖ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ వారీగా వస్తున్న దరఖాస్తులను త్వరగా పరిశీలించి పరిష్కరించాలని తహవీల్దార్లను ఆదేశిం చారు. హౌసింగ్‌లోని ఇకెవైసి ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలన్నారు. జిల్లాలో రీ సర్వే లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని, హద్దురాళ్ళ్లునాటే ప్రక్రియలో ప్రగతి, రెండవ దశ రీ సర్వే గ్రామాలలో ప్రగతి తదితర అంశాలలో సమీక్షించారు. గ్రామ వార్డు సచివాలయాలలో ప్రభుత్వం అందిస్తున్న సేవలు మీద సమీక్షిస్తూ ఎస్‌డిజి, ఆయుష్మాన్‌ భారత్‌ ఇకెవైసి, సంపూర్ణ పోషణ, గడపగడపకు మన ప్రభుత్వం, నైపుణ్యాభివద్ధి, జగనన్న తోడు వంటి సేవలలో మంచి పురోగతి ఉందని, పురోగతిని ఇంకా పెంచాలని కలెక్టర్‌ సంబంధిత అధికారులకు సూచించారు. సమీక్షలో జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఆర్‌ఒ సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్‌డిఒలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహశీల్దార్లు, ఎంపిడిఒలు వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.