Jan 28,2023 21:34

రధోత్సవం

డప అర్బన్‌ : తిరుమల తొలిగడప దేవునికడపలో లోక బాంధవుడు దివాకరుని జన్మదిన శుభ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమేతుడైన అఖిలాండ నాయకుడు కడప రాయుడు కొలువు దీరిన రథాన్ని భక్తులు పోటీపడి ఊరేగించారు. రథోత్సవం కార్యక్రమం కనుల పండువగా నిర్వహించారు. దేవుని కడప బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనిఆవరం కిక్కిరిసిన జనసంద్రం నడుమన శ్రీవారి రథోత్సవం రంగరంగ వైభోగంగా సాగింది. టిటిడి ఆధ్వర్యంలో భక్తుల గోవింద నామస్మరణల మధ్య శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవం పోటెత్తిన భక్తజనులు నయనానందకరంగా దేవుని కడపలో ప్రారంభమైంది. తొలుత టెం కాయ కొట్టి రథోత్సవాన్ని ముందుకు సాగించారు. తేరుపై గంభీరముద్ర సుందర స్వరూ పులైన ఉత్సవమూర్తులను ప్రజలు తనివితీరా తిలకించి పులకించిపోయారు. రథం ముం దుకు సాగుతుండగా భక్తులు గుమ్మడి కాయలు రథచక్రాల కింద ఉంచి మొక్కలు తీర్చు కున్నారు. దేవునికడపలో ఘనంగా రథ ఊరేగింపు అనంతరం శ్రీవారి తేరు తిరిగి తన నిజస్థానంలో నిలిచింది. రథోత్సవం తిరుచానూరు నుంచి విచ్చేసిన వేదపండితులు చిలుక పాటి తిరుమలా చార్యుల బందం ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా టిటిడి భారీ ఏర్పాట్లు చేశారు. డిఎస్‌పి ఆధ్వర్యంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.