Mar 24,2023 22:02

ఉట్లమాను ఉత్సవంలో పాల్గొన్న జనం

ధర్మవరం టౌన్‌ : పట్టణంలోని దుర్గమ్మ ఆలయం పక్కన శుక్రవారం నిర్వహించిన ఉట్లమాను పరుష అంగరంగ వైభవంగా జరిగింది. ఉగాది పండుగ అనంతరం దుర్గమ్మ ఆలయం వద్ద ఉట్లమాను పరుష నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. మొదట దుర్గమ్మ ఆలయంలో ఉట్లమాను కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో బోయ సామాజికవర్గం వారు సాయంత్రం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తప్పెట్లు, డప్పులు వాయిద్యాల నడుమ మహిళలు, ప్రజలు చిందులు వేస్తూ ఉట్లమాను వద్దకు చేరుకున్నారు. ఈ ఉట్లమాను పరుసలో వేలాదిమంది పాల్గొని వేడుకలను తిలకించారు. ఈసందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావడంతో వన్‌ టౌన్‌ సిఐ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.