Mar 30,2023 20:35

రాయచోటి :శ్రీరామ నవమి వేడుకల్లో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి

రాయచోటి టౌన్‌ : కష్టాలెన్ని ఎదురైనా ధర్మాన్ని విడిచిపెట్టని శ్రీరామచంద్రుడిని ప్రజలందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి కోరారు. పట్టణంలోని ఎన్‌జిఒ కాలనీలోని రామాలయంలో శ్రీరామనవమి సంధర్బంగా నిర్వహించిన సీతారాముల కల్యాణంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సంధర్బంగా శ్రీకాంత్‌ రెడ్డి మాట్లాడుతూ సమస్యలు, సంక్షోభాలు ఎదురయినప్పుడు వాటికి భయపడి పారిపోకుండా ఎలా విజయాలు సాధించాలో శ్రీరాముడు లోకానికి చాటి చెప్పారన్నారు. కార్యక్రమంలో యువజన విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదన మోహన్‌ రెడ్డి, మహేష్‌ రెడ్డి, లయన్‌ యర్రపురెడ్డి బ్రహ్మానందరెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు రామచంద్రయ్య,కార్యదర్శి జయచంద్రా రెడ్డి, ఫిజికల్‌ డైరెక్టర్లు నరేంద్ర రెడ్డి, నూకల నరసరాజు, శ్రీనివాసులు, చక్రపాణి పాల్గొన్నారు. రామాపురంలో.. ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సొంతగ్రామం ఎర్రంరెడ్డిగారిపల్లెలోని రామాలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో తన తండ్రి మాజీ ఎమ్మెల్యే గడికోట మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అత్యంత భక్తి శ్రద్ధలతో , వైభవోపేతంగా సీతారాముల కళ్యాణం నిర్వహించారు. మండలంలోని బండపల్లి, హసనాపురం, చిట్లూరు, కుమార్‌పల్లి గ్రామాల సరిహద్దుల్లో వెలసిన అభయాంజనేయస్వామి దేవస్థానంలో శ్రీరామ కళ్యాణ వేడుకల్లో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపిపి ప్రభాకర్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ విశ్వనాధ రెడ్డి, వైస్‌ ఎంపిపి బాబు, యువజన విభాగపు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూరం వెంకట సుబ్బారెడ్డి, వెంకటప్ప పాల్గొన్నారు.
బి.కొత్తకోట: మండల పరిధిలో శ్రీ రామనవమి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని రామాలయాలలో ప్రత్యేక పూజలు చేశారు. మండల కేంద్రమైన బి.కొత్తకోట పోకనాటి వీధిలోని శ్రీరాముని ఆలయంలో సీతారామాంజనేయ ఉత్సవ విగ్రహాలకు విశేష పూజలు చేశారు. అర్చకులు వేద మంత్రాలు, శ్రీ రామ గోవింద నామస్మరణల నడుమ భక్తిశ్రద్ధలతో కల్యాణ క్రతువును నిర్వహించారు. కళ్యాణ మహౌత్సవానికి వచ్చిన వారికి.వివి రెడ్డి, వంక నారాయణరెడ్డి, వంక వెంకట్‌రెడ్డి, కంచి కోదండ, ఎర్రగుంట్ల మోహనరెడ్డి ,ఎర్రగుంట్ల వెంకటరమణ రెడ్డి, కంచి కళ్యాణ్‌ కుమార్‌రెడ్డి, కంచి బలరాంరెడ్డి, కంచి లోకేష్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, తేజరెడ్డి, వంక వెంకట్‌ రమణరెడ్డి, కుట్టి కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు. రాజంపేట అర్బన్‌ : మండల పరిధిలోని వైబియన్‌ పల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వినాయక అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకపూజలు, అభిషేకాలు, ఆకుపూజ, వడమాల పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి అప్పలాచారి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కలికిరి: పట్టణంలోని రెడ్డివారిపల్లెలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. రెడ్డివారిపల్లెలో సర్పంచ్‌ రెడ్డివారి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, ఎల్లమ్మ దేవాలయ చైర్మన్‌ రెడ్డివారి అశోక్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కన్నుల పండుగగా సీతారాముల కల్యాణోత్సవం హిందూ సంప్రదాయ పద్ధతిలో మంగళ వాయిద్యాలు నడుమ, పూలతోరణాలతో, శాస్త్రోతంగా నిర్వహించారు. నందలూరు: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం మండలంలోని ఎగువకుమ్మరిపల్లెలో మాజీ జడ్‌పిటిసి ఎల్లటూరు శివరామరాజు, ఎల్లటూరు శ్రీనివాసరాజు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు బండాత్మకూరు శివకుమార్‌శర్మ ఆధ్వర్యంలో మంత్రోచ్ఛరణలు మధ్య కమనీయంగా రమణీయంగా నిర్వహించారు. యాదగిరి రాజు, విజయలక్ష్మి, దంపతులు, సురేష్‌ రాజు, ఆశ దంపతులు ఉబయదారులుగా వ్యవహరించారు. కళ్యాణ వేదికను పూలతో సుందరంగా అలంకరించి సీతారామ, లక్ష్మణ, హనుమంతు ఉత్సవ విగ్రహాలను విగ్రహాలను కొలువు తీర్చి కళ్యాణ తంతును కమనీయంగా నిర్వహించారు. ముత్యాల తలంబ్రాలు జారవిడిచారు. కళ్యాణ అనంతరం విందును భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ ఆర్‌టిసి రీజనల్‌ చైర్మన్‌ ఎద్దల సుబ్బరాయుడు, టిడిపి నాయకులు సోముల రాజు చంద్రశేఖర్‌ రాజు, మాజీ సర్పంచ్‌ సమ్మెట శివప్రసాద్‌, రాష్ట్ర బిసి నాయకులు శ్రీధర్‌ బాబు యాదవ్‌, తాటి సుబ్బరాయుడు, చామంచి పెంచలయ్య, కానకుర్తి వెంకటయ్య, సర్పంచ్‌ అక్కిరెడ్డి మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. నందలూరు : శ్రీరాముని రాజ్యం నారా చంద్రబాబునాయుడుతో సాధ్యమవుతుందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బత్యాల చెంగల్‌రాయుడు అన్నారు. శ్రీరామనవమి పునస్కరించుకొని ఇసుకపల్లిలో శ్రీరాముని కల్యాణం వైభవంగా జరిగింది. ఈ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల క్లస్టర్‌ ఇన్‌ఛార్జి పసుపులేటి ప్రవీణ్‌ కుమార్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్‌, గొల్లపల్లి సుబ్బరాయుడు, ఎస్‌సి సెల్‌ నియోజకవర్గ అధ్యక్షులు జ్యోతి శివ, గుండు సురేష్‌, గంధం గంగాధర్‌, ముమ్మడిశెట్టి రమేష్‌, నాయకులు బుర్ర సుబ్బరాయుడు పాల్గొన్నారు.తంబళ్లపల్లి: మండలంలో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రామాలయంలో శ్రీనివాసశర్మ స్వామి వారికి ప్రత్యేక అలంకరణతో పూజలు అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. తీర్థప్రసాదాలు వడపప్పు, పానకం పంపిణీ చేశారు. శేష సాయి ఆలయంలో వేద పండితులు స్కంద మూర్తి శర్మ, రాఘవేంద్ర స్వాములు సీతారాముల కల్యాణాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మల్లయ్య కొండపై గౌరమ్మ తల్లి ఆలయంలో గౌరీ దేవి శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మదనపల్లె అర్బన్‌ : పట్టణంలోని అమ్మినేనివీధిలో వెలసిన శ్రీకోదండ రామాలయంలో గురువారం శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దేశారు తిప్పారెడ్డితో పాటు 23వ వార్డు కౌన్సిలర్‌ గిరిజా సాయిశేఖర్‌ రెడ్డి, జోళపాలెం భవానీ ప్రసాద్‌ హాజరై స్వామివారిని దర్శించుకుని కల్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేడుకల్లో ఆలయ కమిటీ సభ్యులు దుగ్గిరెడ్డి, రఘునాథ్‌ రెడ్డి, మోహన్‌ పాల్గొన్నారు. గాలివీడు : ఆలయాల అభివద్ధి కమిటీ ఆధ్వర్యంలో గాలివీడు బస్‌ స్టాండ్‌ ఆవరణంలో శ్రీరామ నవమి పండుగను పురస్కరించుకుని వడపప్పు, పానకం పంపిణీ చేశారు. భక్తులు , ప్రజలు కులమతాలకు అతీతంగా పెద్ద ఎత్తున హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు. పెద్దమండ్యం: మండల కేంద్రంలో కోదండరాముని కోవిలల్లో సీతా రామ లక్ష్మణ ఆంజనేయ స్వాములను పట్టు వస్త్రాలుతో, వివిధ పుష్పలతో అలంకరించి వేదమంత్రాలతో పూజలు, అభిషేకం నిర్వహించారు. మండలంలోని బిక్కవాండ్లపల్లి, రెడ్డివారిపల్లి, ఎర్రసానిపల్లి, బండ్రేవు, కలిచెర్ల, సిద్దవరం, వెళిగల్లు తదితరులు పంచాయతీలలో సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వాములవారిని మంగళ వాయిద్యాలతో, బాణసంచ వేడుకలతో, భజన భక్తులతో ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు మణికంఠస్వామి, ప్రసాద్‌ స్వామి అచ్చుతా స్వామి విజయస్వామి, పవన్‌ స్వామి, జ్యోతి నరసింహ శంకర్‌ స్వామి, భక్తులు పాల్గొన్నారు.