శేషవాహనంపై విహరిస్తున్న వెంకన్న, చిత్రంలో పాల్గొన్న భక్తులు
ప్రజాశక్తి-ఆత్రేయపురం
కోనసీమ తిరుమలగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి 11వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా గురువారం ప్రారంభమయ్యాయి. . ఉదయం 9 గంటల నుండి వేద పండితులు ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్ ఆచార్యుల ఆధ్వర్యంలో అర్చకులు స్వామివారికి వివిధ రకాల పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రమేష్ రాజు దంపతులు మరియు ఇఒ సత్యనారాయణ రాజు దంపతులు, ధర్మకర్త మండల సభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి పరవాసుదేవ అలంకరణలో శేష వాహనంపై కోనేటి రాయుడు మాఢవీధులలో విహరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు యాత్రికులను అలరించాయి. వచ్చిన యాత్రికులకు ప్రసాద వితరణ, అన్నదానం నిర్వహించారు.










