Sep 24,2023 19:34

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-నెల్లూరు :వజ్ఘల సాంస్కృతిక వేదిక ఆద్వర్యంలో ఆదివారం రేబాల లక్ష్మి నరసా రెడ్డి (జూనియర్‌) స్మారక భవనం (ఎ.సి) హాలులో వావిళ్ల సాహితీ వికాసం గ్రంథావిష్కరణ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎంఎల్‌సి విఠపు బాల సుబ్రహ్మణ్యం వావిళ్ళ సాహితీ వికాసం గ్రంధాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ''వావిళ్ళ సంస్థ 170 ఏళ్లలో ఆంధ్ర సంస్కత సాహిత్యాలకు చేసిన సేవ శ్లాఘనీయమని పేర్కొన్నారు. ఈ పుస్తకంలో వావిళ్ల వారితో సంబంధమున్న పండితులు, వావిళ్ళ ప్రచురించిన పుస్తకాల ముఖచిత్రాలు ఉన్నాయన్నారు. ఆత్మీయ అతిథిగా విచ్చేసిన కాళిదాసు పురుషోత్తం మాట్లాడుతూ వావిళ్ళ సంస్థ ఆంధ్ర వ్మాయమునకు చేసిన కషి అనిర్వచ నీయమన్నారు. సాహిత్య విమర్శకులు మాచవోలు శివరామప్రసాద్‌ మాట్లాడుతూ వావిళ్ళ వారు చేసిన సాహిత్య సేవను కొనియాడారు. పుస్తక రచయిత వెంకటరమణ మాట్లాడుతూ 170 సంవత్సరాల వావిళ్ళ సంస్థ చరిత్రను ఇప్పటి వారికి అందించడానికి 12 సంవత్సరాలు పరిశోధించి ప్రచురించినాను అని తెలిపారు. పుస్తకం పరిశోధనలో తన భాగస్వామి వెంకటలక్ష్మి సహకరించిందని తెలిపారు. పానాక కనకమ్మ ట్రస్ట్‌ సభ్యులు సురేంద్రనాథ్‌ రెడ్డి ఇతర ట్రస్ట్‌ సభ్యులు వర్ధమాన సమాజ సభ్యులు పాల్గొన్నారు.