May 02,2023 21:20

ప్లాంటును పరిశీలిస్తున్న కమిషనర్‌

ప్లాంటును పరిశీలిస్తున్న కమిషనర్‌
వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ పరిశీలించిన కమిషనర్‌
నెల్లూరు:నగర వ్యాప్తంగా మంచినీటిని సరఫరా చేస్తున్న సంగం మండలం పరిధిలోని మహమ్మదాపురం వాటర్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ ను నగర పాలక సంస్థ కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆనకట్ట మీద నిర్మించిన ఇండెక్‌ వెల్‌, కొండమీద నిర్మించిన 122 ఎమ్‌.ఎల్‌.డి సామర్ధ్యం గల ట్రీట్మెంట్‌ ప్లాంట్‌, క్లియర్‌ వాటర్‌ సంప్‌, పంప్‌ హౌస్‌ తదితర నిర్మాణాలను, వివిధ విభాగాల పనితీరును ఆయన పరిశీలించారు. వేసవి ఎద్దడిని దష్టిలో ఉంచుకుని నగరంలో నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను కమిషనర్‌ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పబ్లిక్‌ హెల్త్‌ విభాగం ఈ.ఈ ఆలీ, డి.ఈ తిరుమల రావు, నగర పాలక సంస్థ ఇంజనీరింగ్‌ విభాగం ఎస్‌.ఈ సంపత్‌ కుమార్‌, ఈ.ఈ సంజరు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.