- వాటర్ ప్లాంట్‌ను తనిఖీ చేస్తున్న విజిలెన్స్ అధికారులు
రాజంపేట అర్బన్ : మండల పరిధిలోని మదన భోపాలపురంలోని శ్రీసాయి గంగా, కొత్త బోయినపల్లిలోని శ్రీ గంగా మినరల్ వాటర్ ప్లాంట్లను శనివారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో విజిలెన్స్ అధికారి పి.రామకృష్ణ, వ్యవసాయ అధికారి ఇ.బాలగంగాధర్‌రెడ్డి, ఫుడ్ సేఫ్టీ అధికారి శంషుద్దీన్ మాట్లాడుతూ వాటర్ ప్లాంట్లకు సంబంధించిన అనుమతులు, వినియోగిస్తున్న పరికరాలను తనిఖీ చేశామన్నారు. నీటి శుద్ధి విధానాన్ని, ఉత్పత్తిని, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. వాటర్ ప్లాంట్‌లో తయారైన నీటి నమూనాను సేకరించి పరీక్షలకు పంపించారు. ఈ తనిఖీలలో బయటపడిన విషయాలను ఒక నివేదిక ద్వారా ప్రభుత్వానికి అందజేస్తామని పేర్కొన్నారు.










