వాసిలి గ్రామంలో పొలంబడి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : మండలంలోని వాసిలి గ్రామంలో డాక్టర్ వైఎస్‌ఆర్ పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. వాసిలి గ్రామంలో వరి పొలాల మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆత్మకూరు సహాయ వ్యవసాయ సంచాలకులు వి.దేవసేనమ్మ వరి సాగులో శత్రు, మిత్ర పురుగుల ఆవశ్యకతను పురుగుమందుల పిచికారి ఖర్చు తగ్గించుకునే విధానాలను రైతులకు క్షేత్రస్థాయిలో తెలియజేశారు. ప్రస్తుతం ఆశిస్తున్న పురుగులు తెగుళ్లపై రైతులకు అవగాహన నివారణ పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో ఆత్మకూరు మండల వ్యవసాయ అధికారి కె.కిషోర్ బాబు పొలంబడి ముఖ్య ఉద్దేశం వరి సాగులో రైతులు ఆచరించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. కార్యక్రమంలో వాసిలి వివిఎ, ఈశ్వర్, పొలంబడి రైతులు, వాలంటీర్లు పాల్గొన్నారు.










