ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం స్థానంలో కేంద్ర ప్రభుత్వం మను ధర్మాన్ని అమలు చేస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్షులు టి.వి.వి ప్రసాద్ విమర్శించారు. మండలంలోని నరుకూరులో శనివారం ప్రచార భేరి జరిగింది. ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మారు బోయిన రాజా అధ్యక్షతన జరిగిన ఈ ప్రచార భేరి కార్యక్రమంలో ప్రసాద్ ముఖ్య పాల్గొని మాట్లాడారు. మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలన,మతోన్మాద బిజెపిని సాగనంపీ దేశాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సిపిఎం, సిపిఐ నాయకులు వేగూరు వెంకయ్య, కొమారి నందయ్యలు మాట్లాడారు. మోడీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక నిరంకుశ విధానాలకు బుద్ధి చెప్పాలన్నారు. సిపిఎం, సిపిఐ నాయకులు పచ్చ మధు, కాల్తీరెడ్డి రమణమ్మ, గంధం వెంకటేశ్వర్లు, తలారి ఏడుకొండలు, నక్కా సూరిబాబు, శేఖర్, నరుకూరు సెంటర్ సిఐటియు ఆటో యూనియన్ ప్రతినిధులు నాశిన పరశురామయ్య, ,శివ, గణేష్, కనకయ్య, దయాకర్ సాలిపేట ఆటో స్టాండ్ మణి. కొట్టు ముఠావర్కర్ ఆలపాక సంజీవయ్య ఉన్నారు.










