వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న డైరెక్టర్లు
వాల్‌పోస్టర్ ఆవిష్కరణ
నెల్లూరు:కష్ణ చైతన్య లో మెగా జాబ్ డ్రైవ్ గోడపత్రిక ఆవిష్కరణ
నగరం లోని కష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ అఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అలస్టమ్ మేజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ వారు కలసి సోమవారం 23న కాకుటూర్ లోని కష్ణ చైతన్య కాలేజీ లో మెగా జాబ్ డ్రైవ్ నిర్వహిస్తన్నారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్స్ డాక్టర్ ఆర్.వి కష్ణ రెడ్డి, పి.చంద్ర శేఖర్ రెడ్డి గోడ పత్రిక ను అవిష్కరించారు .
సోమవారం జరిగే మెగా జాబ్ డ్రైవ్‌లోసుమారు 16 ఐటి ఇండిస్టీ రిలేటెడ్ కంపెనీలు వస్తున్నాయని, వీటిలో దాదాపుగా 1000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమం లో పీజీ కళాశాల ప్రిన్సిపల్స్ డాక్టర్ యు.మల్లికార్జునయ్య, టి జ్యోతి, ప్లేసెమెంట్ ఆఫీసర్ డి.భానుచంద్ర రెడ్డి, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.










