May 22,2023 21:55

ఫొటో : మాట్లాడుతున్న జెడ్‌పిటిసి మోడీ రామాంజనేయులు

వాలంటీర్లే నిజమైన సేవకులు
ప్రజాశక్తి-ఉదయగిరి : ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరవేస్తున్న గ్రామ వాలంటీర్లే నిజమైన సేవకులను జెడ్‌పిటిసి మోడీ రామాంజనేయులు పేర్కొన్నారు. సోమవారం మండల పరిధిలోని శకునాలపల్లి, తిరుములపురం సచివాలయంలో సర్పంచ్‌ కల్లూరి వెంకటేశ్వర రెడ్డి, కల్లూరి శ్యామలదేవి కృష్ణారెడ్డి, కార్యదర్శి ఆవుల వెంకటరమణ అధ్యక్షతన ప్రారంభమైన గ్రామ వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఏర్పాటు చేసిన గ్రామ వాలంటరీ వ్యవస్థ ఒకటో తేదీన సుర్యోదయానికి ముందే వృద్ధుల గడపకు పెన్షన్‌ కానుక ఇవ్వడంతో పాటు ప్రతి ప్రభుత్వ పథకాన్ని లంచాలు, వివక్ష లేకుండా లబ్ధిదారులకు చేరుస్తూ వారి కళ్లలో ఆనందం నింపుతున్న వాలంటీర్ల సేవలు అద్భుతమన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రజల గడప వద్దకు చేర్చే నిజమైన ప్రజా సేవ చేస్తున్న వాలంటీర్లు నిజమైన సేవకులన్నారు. శకునాలపల్లిలో ఒకరికి సేవారత్న, 12 మందికి సేవామిత్ర పురస్కారాలు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ వాలంటరీ వ్యవస్థ దేశానికీ ఆదర్శ ప్రాయమని కొనియాడారు. అనంతరం వాలంటరీలని సత్కరించి మెమొంటాలను నగదును అందజేశారు. కార్యక్రమంలో జెడ్‌పి కోఆప్షన్‌ సభ్యులు గాజుల తాజుద్దీన్‌, ఎంపిడిఒ ఐజాక్‌ ప్రవీణ్‌, ఇఒపిఆర్‌డి నరసయ్య, కార్యదర్శి కరీముల్లా, షరీఫ్‌, తేజ మాజీ సర్పంచ్‌లు అంబటి సుబ్బారెడ్డి, బాలిబోయిన వెంకటేశ్వర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటరీలు పాల్గొన్నారు.