Jan 29,2023 21:54

ఫొటో : చలానాలు విధిస్తున్న అధికారులు

వాహనాలకు చలానాలు
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని 67, 565 జాతీయ రహదారులపై ఇంటర్‌స్పెక్టర్‌ వాహనం ద్వారా స్పీడ్‌ గన్‌తో పరిమితికి మించి వేగంగా వెళుతున్న వాహనాలకు ఎస్‌ఐ విశ్వనాధ్‌రెడ్డి చలానాలు విధించారు. గ్రామీణ ప్రాంతాల నుండి జాతీయ రహదారులకు అనుసంధానం చేసే గ్రామీణ రహదారులపై 60 కిలోమీటర్ల వేగంతోనే వాహనదారులు ప్రయాణించాలని ఎస్‌ఐ సూచించారు.
అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు, కారులో ప్రయాణించేవారు విధిగా సీట్‌ బెల్టు ధరించి వాహనాలు నడపాలన్నారు. మండలంలో రెండు రోజులు పాటు ఈ స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమం ఉంటుందన్నారు. తొలి రోజు అతివేగంతో వెళ్తున్న 35 వాహనాలను గుర్తించి అపరాధ రుసుం విధించామన్నారు. ఈ స్పెషల్‌ డ్రైవ్‌లో ఇంటర్‌స్పెక్టర్‌ సిబ్బంది, స్థానిక పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.