వాహనాల తనిఖీలు
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని నెల్లూరు-ముంబై జాతీయ రహదారిపై ఎస్‌ఐ విశ్వనాథరెడ్డి శనివారం వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ ధరించకపోవడం, సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానాలు విధించారు. వాహనదారులు మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన, అతివేగంతో వెళ్లిన, వాహనం నడుపుతూ ఫోన్‌లో మాట్లాడిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలలో ఎఎస్‌ఐ శ్రీనివాసులు రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే 13న జరిగే పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికల సందర్బంగా మండలంలో 11వ తేదీ సాయంత్రం 4గంటల నుండి 14వరకు 144వ సెక్షన్ అమలులో ఉంటుందని, ఓటు హక్కు కల్గిన వారు స్వేచ్ఛగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఎస్‌ఐ విశ్వనాధ్ రెడ్డి కోరారు. ఎన్నికల సందర్భంగా మండల ప్రజలు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆవాంచనీయ సంఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.










