Jan 18,2023 18:29

వాహనదారులకు సలహాలు ఇస్తున్న ఎస్‌ఐ రమేష్‌ బాబు


చిన్నమండెం : మండలంలోని రాయచోటి-బెంగళూరు జాతీయ రహదారిపై ఓవర్‌ లోడ్‌తో వెళుతున్న వాహనాలను నిలిపి డ్రైవర్లకు, ప్రయాణికులకు పోలీస్‌ సిబ్బంది కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రమేష్‌ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనానికి ఇన్సూరెన్స్‌, సంబంధిత పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. వాహనదారుడు అన్ని రికార్డులు కలిగివుంటే ప్రమాదం సంభవిస్తే ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని ఆయన సూచించారు.