Jan 03,2023 21:30

దీక్షలో పాల్గొన్న నాయకులు

దీక్షలో పాల్గొన్న నాయకులు
వాహన డ్రైవర్ల నిరవధిక దీక్షలకు సిఐటియు మద్దతు
నెల్లూరు:నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద చెత్త తరలించే వాహన డ్రైవర్లు తమ న్యాయమైన సమస్య ప్రభుత్వం పరిష్కరించాలంటూ చేస్తున్న నిరవధిక దీక్షలు మంగళవారం నాటికి 6వ రోజుకు చేరుకుంది. కార్పొరేషన్‌ అధికారులు గడిచిన 5 నెలల నుంచి వేతనాలు అందజేయడం లేదని, పండుగ సమయంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు బకాయి వేతనం అందజేయాలని చేస్తున్న నిరవదిక దీక్షలకు సిఐటియు నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ నిరవదిక దీక్షా శిభిరం వద్దకు చేరుకున్న నగర, రూరల్‌ సిఐటియు నాయకులు బత్తల క్రిష్ణయ్య, పి.సూర్యనారాయణలు మాట్లాడుతూ 5 నెలల వేతన బకాయిలు చెల్లించాలంటూ గడిచిన 6 రోజుల నుంచి కార్పోరేషన్‌ కార్యాలయం ఎదుట వాహన డ్రైవర్లు నిరవదిక దీక్షలు చేస్తుంటే అధికారులు పట్టిపట్టనట్లు వ్యవహరించడం దారుణమన్నారు.
కార్పొరేషన్‌ లోని 54 డివిజన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ డ్రైవర్లు 46 మంది కి గత ఐదు నెలల నుంచి జీతాలు సక్రమంగా రావటం లేదన్నారు. ఏడు మందికి గత ఐదు నెలల నుంచి ,17 మందికి నాలుగు నెలల నుంచి, 23 మందికి రెండు నెలల నుంచి జీతాలు పూర్తిగా అధికారులు అందజేయలేదన్నారు. వాహన డ్రైవర్లుకు అధికారులు అందజేస్తున్న వేతనాల్లో ఒకొక్కరికి ఒకొక్క రకంగా జీతాలు ఇస్తూ వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నారన్నారు. డ్రైవర్లు శ్రమను అధికారులు జీతాలు తగ్గించి దోసుకుంటున్నారని, ఆ ఇచ్చే జీతాలు కూడా గత ఐదు నెలల కొంతమంది కి,మూడు నెలలు కొంతమందికి, రెండు నెలలు కొంతమందికి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నందు చెత్త బండ్ల డ్రైవర్లు ( కార్మికులు) నిరవధిక దీక్షలకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వాళ్లకి ఇచ్చే జీతాల్లో కోతలు పెట్టి న ప్పటికీ,ఈ ఎస్‌ ఐ, పిఎఫ్‌ సౌకర్యం కూడా కార్పొరేషన్‌ అధికారులు కల్పించడం లేదు. రెండు, మూడు రోజుల కిందట పారిశుద్ధ కార్మికుల జిఎం దీక్షా శిబిరం వద్దకు వచ్చి చెత్త వాహనాల డ్రైవర్ల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి నేటి వరకు ఆదిశగా చర్యలు చేపట్టలేదన్నారు. ఇప్పటికైనా నగర పాలక సంస్థ కమిషనర్‌, అధికారులు స్పందించి వేతన సమస్యను వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ సమస్య పరిష్కరించని యెడల సిఐటియు అన్ని కార్మిక ,ప్రజా సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని హెచ్చరించారు. ఈ దీక్షలు కార్యక్రమానికి ఆవాజ్‌ జిల్లా అధ్యక్షులు ఎస్‌ డి .రఫీ అహ్మద్‌ ఆవాజ్‌ రూరల్‌ కార్యదర్శి ఎస్‌ డి. మీ రా, జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌.కె . గౌస్‌ పీర్‌ లు కార్మికుల చేస్తున్న దీక్ష దగ్గరకొచ్చి మద్దతు ఇచ్చారు. దీక్ష కార్యక్రమంలో చెరుకూరు వెంకటేశ్వర్లు, పవన్‌ ,రవి, ప్రేమ సాగర్‌ ,అశోక్‌, వెంకటేష్‌, రియాజ్‌, రిజ్వాన్‌ తదితరులు పాల్గొన్నారు.