Jul 12,2021 07:48

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ఆల్‌ ఖైదా దాడుల ప్రణాళికను పోలీసులు ఆదివారం భగం చేశారు. లక్నోతో సహా రాష్ట్రంలో ఇతర పట్టణల్లోని రద్దీ ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులతో సహా పలు దాడులకు ఆల్‌ఖైదా ప్రణాళిక వేసిందని పోలీసులు వెల్లడించారు. లక్నో జిల్లాలోని ఈ గ్రూపునకు చెందిన ఇద్దరిని అరెస్టు చేయడంతో ప్రణాళిక విషయం బయటపడిందన్నారు. అరెస్టు చేసిన మినాహజ్‌ అహ్మద్‌, మసీరుద్దిన్‌ల నుంచి పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టి, విచారణ కోసం కస్టడీకి ఇవ్వాలని కోరనున్నట్లు సీనియర్‌ పోలీస్‌ అధికారి ప్రశాంత్‌ కుమార్‌ చెప్పారు.