Jan 07,2023 21:42

ఫొటో : పోలేరమ్మ ఆలయం వద్ద మాట్లాడుతున్న సిఐ రాజేష్‌

ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి
ప్రజాశక్తి-అల్లూరు : పోలేరమ్మ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కావలి రూరల్‌ సిఐ రాజేష్‌ వెల్లడించారు. శనివారం మండల కేంద్రం స్థానిక పోలేరమ్మ ఆలయం వద్ద ఆయన మాట్లాడుతూ ప్రముఖ ప్రసిద్ధిగాంచిన పోలేరమ్మకు జనవరిలో ఉత్సవాలు చేయడం ఆనవాయితీగా వస్తున్న ఆచారమన్నారు. కాగా నూతన జిఒ నెంబర్‌ 1 ప్రకారం నిర్వాహకులకు నోటీసులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 10న అమ్మవారి ఉత్సవం నిర్వహిస్తున్న క్రమంలో పురవీధులలో ఊరేగింపు కార్యక్రమంలో పలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
బందోబస్తుకు సంబంధించి రూట్‌మ్యాప్‌ రెడీ చేసుకుంటున్నామని ఇందుకు సంబంధించి కావలి డిఎస్‌పి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తారని తెలియజేశారు. తొక్కిసలాట లేకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని అలాగే పరస్పరంగా ఒకరికొకరు సహకరించుకోవాలన్నారు. గ్యాంబ్లింగ్‌, మద్యం సేవించి ఈవ్‌టీజింగ్‌ పాల్పడి పబ్లిక్‌లో అల్లర్లు సృష్టిస్తే వెంటనే అదుపులోకి తీసుకొని చర్యలు చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ శ్రీనివాసులు రెడ్డి తదితరులున్నారు.