రాయచోటి : ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలో మెగా సైక్లోథాన్ కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. అదనపు డిఎంహెచ్‌ఒ డాక్టర్ శైలజ జెండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రతీ హెల్త్ వెల్నెస్ సెంటర్‌లో ఉచిత అసంక్రమిత వ్యాధుల మెడికల్ క్యాంప్ నిర్వహించామన్నారు. జీవనశైలిలో మార్పులు పాటించడం వల్ల ఆరోగ్యం పొందవచ్చునున్నారు. జిల్లా ఎన్‌సిడి ప్రోగ్రాం అధికారి డాక్టర్ శేషగిరి బాబు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 374 హెల్త్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయని తెలిపారు. డిప్యూటీ డిఎంహెచ్‌ఒ సిరోమని మాట్లాడుతూ హెల్త్ వెల్నెస్ సెంటర్‌లో అందుచున్న సేవలు అందరికీ తెలిసేలా చేయాలన్నారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ, డిఐఒ డాక్టర్ ఉషశ్రీ, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్ మధుసూ దన్‌రెడ్డి, డిఎన్‌ఎంఒ డాక్టర్ విషువర్ధన్‌రెడ్డి, డిఎంఒ వేణుగోపాల్, ఎస్‌ఒ ఓబుల్‌రెడ్డి, హెచ్‌ఇఒ సత్యనారాయణ, సిహెచ్‌ఒ యాదవ్, హెల్త్ ఎడ్యుకేటర్ మహమ్మద్ రఫీ, పర్యవేక్షకులు వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు. పుల్లంపేట : మండల పరిధిలోని స్థానిక ఆరోగ్య కేంద్రంలో సైక్లోథాన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ మనోజ్ కుమార్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రాజా, డాక్టర్ సామి శేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










