తనిఖీలు నిర్వహిస్తున్న దృశ్యం
ు.స్పెషల్ ఆఫీసర్ ఆకస్మిక తనిఖీలు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ముఖ్య కార్యనిర్వణాధికారి, జిల్లా ప్రజా పరిషత్, ఆత్మకూరు మండలం స్పెషల్ ఆఫీసర్ బి.చిరంజీవి మండలంలోని పలు చోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంగళవారం ఆయన మండలంలో సుడిగాలి పర్యటన గావించారు. ఈ సందర్భంగా మండలంలో ఇటీవలే తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలలో కేటాయించిన ఎఫ్‌డిఆర్ పనులను పరిశీలించారు , బోయిల చిరువెళ్ల లో సచివాలయంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ నిర్మితమవుతున్న సచివాలయం బిల్డింగ్స్‌ను పరిశీలించారు. తదుపరి పటణంలోని జిల్లా ప్రజా పరిషత్ బాలికల హైస్కూల్‌ను తనిఖీ చేశారు. అటెండెన్స్, లీవులను పరిశీలిం చారు. అక్కడి ప్రధానోపాధ్యాయులు తరచూ సెలవులు పెట్టడం పై అసంతప్తి వ్యక్తం చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ఎంపిడిఒ సి. శ్రీనివాసులు, విద్యాశాఖ అధికారి షేక్ నజీర్ బాషా పాల్గొన్నారు.










