Jul 05,2022 23:50

ప్రజాశక్తి-ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం మండలం కేతనకొండ గ్రామంలో స్థానికంగా ఉన్న ఉర్థూ ఠశాలను విలీనం చేయవద్దు అంటూ స్థానిక మహిళలు మంగళవారం ఆందోళనకు దిగారు. పాఠశాల పునఃప్రారంభం చేస్తుండటంతో గేటుకు తాళాలు తీయకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను విలీనం చేయడానికి ఒప్పుకోమని ప్రభుత్వం విలీనం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డి మాండ్‌ చేస్తూ ధర్నాకు దిగారు. స్థానిక ఎంఈఓ తప్పుడు సమాచారం ఇవ్వడం వలననే ఈ పరిస్థితి వచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను సైతం గేటు ముందు కూర్చున్నారు.