Mar 10,2023 22:05

నిరసనలో పాల్గొన్నయుటిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి - కొత్తచెరువు : రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల పైన వైసిపి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని ఇది తగదని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు జయచంద్ర రెడ్డి, ప్రధాన కార్యదర్శి నాగేంద్ర అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 26 డీఈవో ఆఫీసుల వద్ద ఉపాధ్యాయుల వేధింపులపై ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్న నేపథ్యంలో కొత్త చెరువులోని గాంధీనగర్‌ పాఠశాలలో ఉన్న డీఈవో ఆఫీసు వద్ద శుక్రవారం సాయంత్రం యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా యుటిఎఫ్‌ నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు వేధింపులు, యాపుల సమస్యల ద్వారా మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. వేతనాలు సక్రమంగా ఇవ్వడం లేదన్నారు. ప్రశ్నించే వారిపైన ప్రభుత్వం కేసులు పెడుతోందని విమర్శించారు. మధ్యాహ్నం భోజనం సమస్యల పైన కూడా ఉపాధ్యాయులపైనే నెపం నెట్టుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులపై వేధింపులకు పాల్పడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో పోరాటాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి కోనంకి చంద్రశేఖర్‌, హెచ్‌ భాస్కర్‌, నాయకులు లక్ష్మీనారాయణ, బాబు, పెద్దన్న, నరసింహులు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇఎస్‌ వెంకటేష్‌, నాయకులు అంజి, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.