Dec 11,2022 22:21

సజ్జల రామకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న వైఎస్‌ఆర్‌టిఎఫ్‌ నాయకులు

ప్రజాశక్తి నంబుల పూలకుంట : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్‌ఆర్‌టిఎఫ్‌ నాయకులు కోరారు. మండల కేంద్రంలో జరిగిన ఓ శుభ కార్యక్రమానికి ఆదివారం హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డిని వైఎస్‌ఆర్‌టిఎఫ్‌ స్థానిన నాయకులు కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్‌టిఎఫ్‌ నాయకులు గంగాధర్‌ రెడ్డి, వెంకట్రామి రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ సిపిఎస్‌ రద్దుచేసి సిపిఎస్‌ అమలు చేయాలన్నారు. పెండింగ్‌ ఉన్న పిఆర్‌సి, డిఎ చెల్లించాలన్నారు. అదేవిధంగా బోధనేతర పనులైన వివిధ యాప్లను, నాడు నేడు నుంచి టీచర్లను మినహాయించాలని సకాలంలో వేతనాలు అందేలా చూడాలని కోరారు. తమ సమస్యలపై సజ్జల రామకృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌టిఎఫ్‌ నాయకులు అంజి నాయక్‌, ఇంద్ర ప్రసాద్‌, శివయ్య, మనోహర్‌ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.