Oct 13,2022 22:50

  • డిఆర్‌ఒను కలిసిన యుటిఎఫ్‌ నేతలు

ప్రజాశక్తి-ఎడ్యుకేషన్‌: ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించి పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ, డిఎ, సరెండర్‌ లీవులు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ యుటిఎఫ్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా ఆధ్వర్యంలో నగరంలోని డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌కు గురువారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్‌టిఆర్‌ జిల్లా యుటిఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శిలు కె.శ్రీనివాసరావు, ఎ.సుందరయ్య మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లి వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు. జిల్లాలో కోట్లాది రూపాయలు గత ఆర్థిక సంవత్సరం నుండి పెద్ద స్థాయిలో బకాయిపడి ఉన్నాయన్నారు. పిఎఫ్‌, ఎపిజిఎల్‌ లోను, పార్టు ఫైనల్‌ మంజూరైన వారికి సొమ్ము చెల్లించకుండానే మంజూరైన మొత్తాన్ని వారి ఖౄతాల నుండి తగ్గించడం వల్ల వేలాది రూపాయలు వడ్డీ నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సరెండర్‌ లీవులు మంజూనరైన వారు సైతం సొమ్ము చెల్లించకుండానే వారి ఖాతా నుండి లీవులు తగ్గించబడుతున్నాయన్నారు. రిటైర్‌మెంట్‌ అయిన వారికి సైతం పిఎఫ్‌, ఏపిజిఎల్‌ఐ, జిఐఎస్‌, అర్థ జీతపు సెలవునగదు, గ్రాడ్యూటీ, కమ్యూటేషన్‌ మొత్తాలు నేటికీ చెల్లించలేదన్నారు. డిఆర్‌వోను కలిసిన వారిలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శులు కె.శ్రీనివాసరావు, ఎస్‌.పి.మనోహర్‌కుమార్‌, జిల్లా కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యులు ఎ.గోపాలకృష్ణ తదితరులు ఉన్నారు.