ప్రజాశక్తి -కందుకూరు : పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించిన ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ప్రజాసంఘాలా కార్యాలయంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీహర్ష మాట్లాడుతూ కందుకూరులోని బిఆర్ ఆక్స్‌ఫర్డ్ స్కూల్లో చదువుతున్న విద్యార్థినిపై అదే స్కూల్లో సోషల్ బోధించే టీచర్ రమేష్ ఎవరూ లేని సమయంలో విద్యార్థిని ఇంటికి వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించడం దారుణమన్నారు. లింగసముద్రం మండలంలోని అన్నెబోయిన పల్లిలో 3వ తరగతి చదివే బాలిక పై అదే ఊరికి చెందిన ఓ మైనర్ బాలుడు అత్యాచారం చేయడం దారుణమన్నారు. విద్యార్థినులపై వరుసుగా జరుగుతున్న సంఘటనలు సభ్య సమాజం తలదించునేలా ఉన్నాయన్నారు. ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు జరుగుతు న్నాయన్నారు. దిశ, నిర్భయ చట్టాలు ఎన్ని ఉన్నా అవి కేవలం నామమాత్రంగా అమలవుతున్నాయన్నారు. పదో తరగతి విద్యార్థినిపై అత్యా చారానికి యత్నించిన రమేష్ పై ఫోక్షో చట్టం కింద కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. 3వ తరగతి విద్యార్థిని పై అత్యాచారానికి పాల్పడిన బాలుడి పై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. ఆ విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం అందించాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కమతం హేమంత్ కుమార్ ఉన్నారు.










