జిల్లాలోని ఉపాధి హామీ కూలీలకు నీడకరువైంది. ఈ ఏడాది ఏప్రిల్, మే మాసాల్లో 42 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో కూలీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న నేపథ్యంలో డ్వామా యంత్రాంగం కనీస సదుపాయాల్ని ఏర్పాటు చేయకుండా ఉపాధి కూలీల సంరక్షణను గాలికొదిలేసింది. యుపిఎ హయాంలో వామపక్షాల చొరవ కారణంగా అమల్లోకి వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని కేంద్రంలోని బిజెపి సర్కారు దశల వారీగా నిర్వీర్యం చేసే ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. సదుపాయాల కల్పన దగ్గర నుంచి కూలీలకు పని దినాల తగ్గింపు దశల వరకు క్రమేణా నిర్వీర్యం చేస్తోంది. ఈనేపథ్యంలో ప్రజాశక్తి బృందం గురువారం ఒంటిమిట్ట మండలంలో పర్యటించింది. ఉపాధి హామీ పనుల క్షేత్ర స్థాయి పరిశీలనలో టెంట్లు, మెడికల్ కిట్స్, తాగునీటి వంటి కనీస సదుపాయాలను కల్పించడంలో చోటుచేసుకున్న నిర్లక్ష్యం విస్మయాన్ని కలిగించింది.ప్రజాశక్తి - కడప ప్రతినిధి
జిల్లాలో ఉపాధి కూలీలు కనీస వస తులకు నోచుకోలేదు. ఉపాధి హామీ చట్ట నిబం ధనల మేరకు పని ప్రదేశాల్లో కూలీలకు టెంట్లు, తాగునీరు, మెడికల్ కిట్స్ వంటి సదు పాయాల్ని అందుబాటులో ఉంచాలి. పదేళ్లుగా కేంద్రంలోని బిజెపి సర్కారు ఉపాధి హామీ పథకాన్ని బడ్జెట్ కేటా యింపుల దగ్గర నుంచి నిర్వీర్యం చేస్తూ వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సాఫ్ట్‌వేర్ పరిధిలోని ఉపాధి హామీ పనుల వ్యవహారాన్ని తాజాగా ఎన్‌ఎంఎస్ సాఫ్ట్ వేర్‌లోకి మార్చింది. ఉపాధి హామీ కూలీల కనీస సదుపాయాల కల్పనలో నిర్లక్ష్యం దగ్గర నుంచి టెంట్లను ఏర్పాటు చేయడంలో జాగ్రత్తలు తీసుకోక పోవడం, తాగునీటి సదుపాయాలను కల్పించక పోవడం, మెడికల్‌కిట్స్‌ను అందుబాటులో ఉంచక పోవడం, సకాలంలో వేతనాలు పడకపోవడం, పని డిమాండ్ చేసిన కూలీల పని దినాల తెగ్గోత వంటి సమస్యలను సృష్టించి నిర్వీర్యం చేస్తోందని కూలీలు వాపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.
లక్ష మంది హాజరు సరే
జిల్లాలో గురువారం 1.09 లక్షల మంది ఉపాధి పనులకు హాజరయ్యారు. ఈ ఏడా దిలో అత్యధిక మంది హాజరు ఇదే కావడం గమనార్హం. జిల్లాలో 2,40,983 జాబ్‌కార్డులు ఉన్నాయి. ఇందులో 4,38,802 మంది ఉన్నారు. వీరిలో 1,95,363 మంది యాక్టివ్ కార్డు దారులు ఉన్నారు. ఇందులో 3,34,508 మంది యాక్టివ్ కూలీలు ఉన్నారు. వీరికి సంబంధించి 97,704 కుటుంబాలు ఉపా ధి పనులకు వచ్చిన జాబితాలో ఉన్నాయి. ఇందులో 1,47,048 మంది ఉపాధి పనులకు హాజరు జాబితాలో ఉన్నారు. గురువారం అత్యధికంగా లక్ష మంది హాజరుకు తగిన ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించడం విస్మయాన్ని కలిగించింది.
కనీస వసతులూ కరువే!
జిల్లా ఉపాధి హామీ యంత్రాంగం కూలీల సంరక్షణను గాలికి వదిలేసింది. ఒంటిమిట్ట మండలంలోని ఉపాధి హామీ పనుల ప్రదేశాలను ప్రజాశక్తి బృందం పరిశీలించింది. ఒంటిమిట్ట మండలం 13 పంచాయతీల్లోని 63 ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులకు 2,155 మంది పనులకు హాజరు తీరును, వసతులను గమనించింది. అత్యధికంగా రాచగుడిపల్లి, గంగపేరూరు, చింతరాజుపల్లి వంటి ప్రాంతాల్లో సుమారు 300 మంది వరకు హాజరయ్యారు. రాచగుడిపల్లి, ఒంటిమిట్ట పంచాయతీల్లో ఉపాధి హామీ పనుల క్షేత్రస్థాయి పరిశీలనలో ఉపాధి హామీ నిబంధనల మేరకు ఏర్పాటు చేయాల్సిన నిబంధనలు అమలుకు నోచని వైనాన్ని గమనించింది. టెంట్లు, తాగునీరు, మెడికల్‌కిట్స్ వంటి కనీస వసతుల్లో ఏఒక్కటీ అమలుకు నోచుకోకపోవడం గమనార్హం.
సూర్యతాపం ధాటికి విలవిల
ఈ ఏడాది ఏప్రిల్, మే మాసాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపించడం తెలిసిందే. జిల్లాలో రెండ్రోజుల కిందటి నుంచి 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మూడ్రో జులపాటు జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరికల నేపథ్యంలోనూ ఉపాధి కూలీల ప్రాణాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవ హరి ంచడం ఆందోళన కలిగిస్తోంది. ఒంటిమిట్ట రైల్వే స్టషన్ ఎగువ భాగంలోని కొండ ప్రాంతంలోని ఉపాధి కూలీల పనుల్ని పరిశీలిస్తే ఎర్రటిఎండలో ఉ పనులు చేస్తున్న కూలీలకు ఎండబారి నుంచి కాపాడుకునేందుకు నీడనిచ్చే చిన్నపాటి చెట్టు కూడా లేకపోవడం గమనార్హం. మండు టెండల్లో పట్టు కున్న గడ్డపారలు, గంపలు కాలిపో తుండడంతో పట్టుకుని తవ్వలేక, ఎండవేడిమిని తాళలేక కూలీలు విలవిలలాడుతున్న దృశ్యం కనిపించింది.
తాగునీరూ కరువే!
తాను ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటున్న బాటిల్ నీళ్లనే తాగుతున్నా. బాటిల్ నీళ్లు అయితేపోతే ఇంటికి వెళ్లే వరకు ఆగాల్సిందే. ఇక్కడ ఎటువంటి సదుపాయమూ లేదు. సమీపంలోనూ నీళ్లు దొరికే అవకాశం లేదు.
- పుల్లయ్య, ఉపాధి కూలీ, రాచగుడిపల్లి, ఒంటిమిట్ట.
టెంట్లు ఏర్పాటు చేస్తాం
ఉపాధి ప్రదేశాల్లో టెంట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. ఎండ వేడిమి అధికంగా ఉంటున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని పేర్కొనడం గమనార్హం.
- శివశంకర్‌రెడ్డి, ఎపిఒ, ఒంటిమిట్ట.
టెంట్లు ఏర్పాటు చేయకపోతే ఆందోళన
ఉపాధి ప్రదేశాల్లో టెంట్లు ఏర్పాటు చేయకపోతే ఆందోళన చేపడతాం. 42 డిగ్రీల కుపైగా ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూలీల ప్రాణాల గురించి ఆలో చించకపోవడం దారుణం.
- కె.నరసయ్య, మండల కార్యదర్శి, వ్య.కా.స, ఒంటిమిట్ట.










