Feb 10,2023 22:52

ఫొటో : మాట్లాడుతున్న అంబటి శ్రీనివాసులు

'ఉపాధి' పనులు పరిశీలన
ప్రజాశక్తి-ఉదయగిరి : జరిగిన ఉపాధి హామీ పనులు, ప్రభుత్వ పథకాలను నేషనల్‌ లెవెల్‌ మానిటరింగ్‌ కమిటీ బృందం ప్రిన్సిపల్‌ కోఆర్డినేటర్‌ అంబటి శ్రీనివాసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. శుక్రవారం మండల పరిధిలోని బండగానిపల్లి జి.చెర్లోపల్లి పంచాయతీల్లో పర్యటించి కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి అమలు తీరుపై ఆరా తీశారు.
అలాగే సచివాలయ సిబ్బందితో గ్రామంలోని ప్రజలు లబ్ధిదారులతో సమావేశమై పిఎం కిసాన్‌, ఉపాధి హామీ పథకం, గ్రామీణ సడక్‌ యోజన లాంటి పథకాలపై పలువురుని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.