Mar 01,2023 21:41

ఫొటో : మాట్లాడుతున్న ఎంపిడిఒ శ్రీదేవి

'ఉపాధి' పనులపై సామాజిక తనిఖీ
ప్రజాశక్తి-అల్లూరు  : మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయ సమావేశం మందిరంలో ఉపాధి హామీ పనులపై బుధవారం అధికారులు సామాజిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ శ్రీదేవి మాట్లాడుతూ మండలంలో రూ.8 కోట్లతో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులకు సంబంధించి 15వ విడత తనిఖీలు చేపట్టామన్నారు.
ఇందులో భాగంగా పంచాయతీరాజ్‌ శాఖ, హౌసింగ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఆయా శాఖలకు సంబంధించిన రికార్డులు పరిశీలించామన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.