May 20,2023 22:04

ఫొటో : ఉపాధి కూలీల కోసం ఏర్పాటు చేసిన టెంట్లు

ఉపాధి కూలీలకు టెంట్లు ఏర్పాటు
- ప్రజాశక్తి కథనానికి స్పందన
ప్రజాశక్తి-వరికుంటపాడు : ప్రజాశక్తిలో వచ్చిన కథనం మేరకు ఎంపిడిఒ విజరు భాస్కర్‌ రావు ఆదేశాలతో మహాత్మా గాంధీ ఉపాధి హామీ కూలీలకు ఎపిఒ శ్రీనివాసులు టెంట్లను ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందజేశారు. శనివారం మండల పరిధిలోని జడదేవి గ్రామంలో జరుగుతున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీలు చేపడుతున్న పనులను ఆయన పరిశీలించారు.
కచ్చితంగా కూలీలు పనిచేసే సమయంలో నీడ కోసం కచ్చితంగా టెంట్లను ఉపయోగించాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. వడదెబ్బ నివారణకు ఓఆర్‌స్‌ ప్యాకెట్లను కూలీలకు అందజేశారు. మెడికల్‌ కిట్‌ కూలీలకు పని ప్రదేశంలో అందుబాటులో ఉంచమన్నారు. ఎంపిడిఒ ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.