'ఉపాధి' కూలీలకు సూచనలు
ప్రజాశక్తి-ఉదయగిరి : మహాత్మా గాంధీ ఉపాధి కూలీలకు సిబ్బందికి ఎపిఒ శ్రీనివాసరావు పలు సూచనలు చేశారు. శనివారం మండల పరిధిలోని శకునాలపల్లి, పుల్లాయపల్లి పంచాయతీలో జరుగుతున్న ఉపాధి పనులను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి కూలీలకు సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి పనులు చేసే ప్రదేశాలలో పనులకు తగ్గట్టు పొడవు వెడల్పులను గుర్తుంచుకొని వేతనం రూ.272 రోజు కూలి పడేలా పనులు కూలీలు చేసుకోవాలన్నారు. సిబ్బంది ప్రభుత్వం కల్పించిన టెంట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు మాంచీ నీరు పనులు జరిగే ప్రదేశాలలో తప్పనిసరిగా ఉంచాలని సిబ్బందికి పలు సూచనలు చేశారు. కూలీలు వేసవి దృష్టి ఉదయం 6 నుండి 10 గంటలలోగా పనులు పూర్తి చేసుకునేలా ఉండాలని కూలీలకు ఆయన పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో సిబ్బంది కూలీలు పాల్గొన్నారు.










