ప్రజాశక్తి-నందిగామ : నందిగామ మండలం కేతవీరునిపాడు గ్రామం హరిజనవాడ నందు గుండెపోటు తో మృతి చెందిన ఉపాధి కూలీ
కోట ఆనందరావు భౌతిక కాయాన్ని మాజీ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆనందరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు నెలకుదిటి నాగేశ్వరరావు పాల్గొన్నారు.










