ఉపాధి హామీ పనులు పరిశీలన
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని పొంగూరు బాటకర్లకుంటలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను డ్వామా పిడి వెంకటరావు పరిశీలించారు. మండలంలో ఉపాది హామీ పథకం పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డ్వామా పిడి వెంకటరావు తెలిపారు. అలాగే కూలీలు పనిచేసే వద్ద సమయపాలన పాటిస్తూ ఉపాది హామీ పనులు చేసుకోవాలన్నారు. ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించలా ప్రణాళిక సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి రోజు రూ.272లు వేతనం పొందేలా రోజు వారి కొలతలు ఇచ్చి వాటి ప్రకారం పని చేయాలన్నారు. పని ప్రదేశంలో ఉదయం చల్లపొద్దు పని చేసుకోవాలని, ఎండ వేడిమి తట్టుకోవడానికి కూలీలు తలపాగా చుట్టుకొని పని చేయాలని సూచించారు. పని ప్రదేశంలో మెడికల్ కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మంచి నీరు అందుబాటులో ఉంచుకోవాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించినారు. ఎస్‌సి ఎస్‌టి వికలాంగులకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. మండలంలో జాబు కార్డు లేని కుటుంబాలకు సత్వరం జాబుకార్డు ఇప్పించి ఉపాది పనులు కల్పించాలని ఆదేశించారు.










