Jan 07,2023 19:25

నిరసన తెలుపుతున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-మదనపల్లె అర్బన్‌ : విదేశీ యూనివర్సిటీలతో పేద విద్యార్థులకు ఉన్నత చదువులు ప్రశ్నార్థకమేనని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కార్తీక్‌, నరసింహలు అన్నారు. విదేశీ యూనివర్సిటీలను స్వాగతిస్తూ మన దేశంలో క్యాంపస్‌లు పెట్టుకోవడానికి ఫీజులు నిర్ధారణ ప్రవేశాలలో స్వేచ్ఛను కల్పిస్తూ యూనివర్సిటీ గ్రాండ్‌ కమిషన్‌ ముసాయిదా మార్గదర్శకాలను పత్రాలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశీ యూనివర్సిటీలు మన దేశానికి రావడం వల్ల పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదవడానికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మన రాష్ట్రంలో డిఎండి యూనివర్సిటీలో వచ్చి డబ్బున్న వారికే చదవనటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో స్పష్టంగా కనపడతా ఉంది కేంద్ర ప్రభుత్వం విదేశీ యూనివర్సిటీలు రావడం ద్వారా ఏ విధంగా పేద విద్యార్థులకు విద్యా అందుతుందో చెప్పాలన్నారు. దేశ విదేశాలకు సంబంధించిన బోధన సిబ్బందిని నియమించుకోవచ్చు ఫీజు నియంత్రణ లేకుండా ఎంతైనా నిర?యించుకో వచ్చిన స్వేఛ ఇవ్వడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి ఆదాయాన్ని వారి దేశాలకు తీసుకెళ్లచ్చని రెడ్‌ కార్పొరేట్‌ పరిసి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి బరితెగింపు చర్యలు చేయడం అంటే దేశాల యొక్క విద్యా వ్యవస్థను మాతృభాషను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరాయి దేశాలకు అప్పజెప్పడం తప్ప మరొకటి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే యూజీసీ చైర్మన్‌ ఎం జగదీష్‌ కుమార్‌ విడుదల చేసిన ముసాయిదా మార్గదర్శకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని పేర్కొన్నారు. అలా లేని పక్షంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.గణేష్‌ జయబాబు, నాగేంద్ర, నవీన్‌, నాని పాల్గొన్నారు.