ప్రజాశక్తి -హిందూపురం : పట్టణానికి చెందిన ముస్లీం నగారా అధ్యక్షుడు ఉమర్ ఫారూక్‌కు గిడుగు రామ్మూర్తి జాతీయ సాహితీ పురస్కారం దక్కింది. గిడుగు రామ్మూర్తి 83వ జయంతిని పురస్కరించుకుని శనివారం రాత్రి హైదరాబాద్‌లోని శంకరం వేదిక హాల్లో గిడుగు రామ్మూర్తి పంతులు పౌండేషన్, శంకరం వేదిక సంయుక్తంగా సాహిత్య, కళా, సేవారంగాల వారిగా కృషి చేసిన వారికి పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉమర్ ఫారూక్ రాసిన 'నేనూ ఈ దేశపు మూల వాసినే' అనే దీర్ఘ కవితకు, అలాగే ఆయన సేవలకు గిడుగు రామ్మూర్తి జాతీయ పురస్కారం దక్కగా, పురస్కారాన్ని పౌండేషన్ అధ్యక్షురాలు గిడుగు కాంతికృష్ణ, కళారత్న బిక్కికృష్ణ, తెలంగాణా హైకోర్టు న్యాయమూర్తి రాధారాణి, ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్, జీవన్లాల్ లవాడియా, శతచిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, బీసీ కమిషన్ అధ్యక్షుడు వకుళా భరణం కృష్ణ మోహన్ చేతుల మీదుగా అందుకున్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ రాధారాణి చేతుల మీదుగా ఉమర్ ఫారూక్ రాసిన నేనూ ఈ దేశపు మూల వాసినే దీర్ఘ కవితా పుస్తకాన్ని ఆవిష్కరించారు.










