న్యూఢిల్లీ : గతంలో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించి డాన్‌బాస్ ప్రాంతంలోని రెండు రిపబ్లిక్‌ల ప్రజలను కష్టాల్లోకి నెడుతున్న ఉక్రెయిన్ అన్యాయ వైఖరికి వ్యతిరేకంగా రష్యా సైనిక చర్య ప్రారంభించింది. కొత్తగా రిపబ్లిక్‌లుగా గుర్తింపు పొందిన డాన్‌బాస్ ప్రారతాల్లోని డొనెట్క్స్, లుహాన్స్క్ రిపబ్లిక్‌లు రష్యా మిలిటరీ సాయాన్ని కోరాయి. యుక్రెయిన్ సైన్యం దాడుల కారణంగా తమ ప్రాణాల ప్రాణాలకు ముప్పు ఏర్పండిందని ఆ రిపబ్లిక్‌లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు ప్రాంతాలను స్వతంత్య్ర రాజ్యాలుగా రష్యా గుర్తించినప్పటి నుండి ఉక్రెయిన్ తమపై మరింద దూకుడుగా వ్యవహరిస్తుందని ఆదేశాధినేతలు పేర్కొన్నారు. ఈ మేరకు డొనెట్క్స్ పీపుల్స్ రిపబ్లిక్ (డిపిఆర్), లుహాన్స్క్ పీపుల్స్ రిపబ్లిక్ (ఎల్‌పిఆర్) దేశాధినేతలు ఈ నెల 22న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌కు వేర్వేరుగా లేఖలు రాశారు. రష్యాతో సహకారం, పరస్పర సహాయంపై కొత్తగా ఆమోదించిన ఒప్పందాల్లో భాగంగా.. ఉక్రెయిన్ సైనిక దురాక్రమణను తిప్పికొట్టడంలో సాయం అందించాలని దేశ అధ్యక్షులు కోరారు. 'ఉక్రెయిన్ దూకుడు మరింత పెంచింది. గతంలో బాంబు దాడుల కారణంగా దేశంలో ప్రధాన నీటి వనరులు దెబ్బతినడంతో 3 లక్షల మంది ప్రజలు దాహార్తితో బాధపడుతున్నారు.' అని డొనెట్క్స్ రిపబ్లిక్ అధ్యక్షుడు డెనీస్ పుస్లిన్ అన్నారు. దేశ పౌరులపై ఉక్రెయిన్ మారణహోమాన్ని సృష్టిస్తోందని అన్నారు. ఇప్పటి వరకు 40 వేల మంది ప్రజలు తరలివెళ్లినట్లు తెలిపారు.
ఉక్రెయిన్ చర్యలు చూస్తుంటే.. మిన్స్క్ ఒప్పందాలు పూర్తిగా బేఖాతరు చేసి.. డాన్‌బాస్‌లో యుద్ధాలు చేపట్టేటట్లు కనిపిస్తుందని లుహాస్స్క్ రిపబ్లిక్ అధ్యక్షుడు లియోనిడ్ పసెచ్నిక్ అన్నారు. అమెరికా, పశ్చిమ దేశాల నుండి సైనిక బలగాల సాయాన్ని ఉక్రెయిన్ పొందుతుందని, తమను నాశనం చేసేందుకు ఈ దేశం సిద్ధపడిందని పేర్కొన్నారు. తమపై దాడి చేస్తోందన్న ఆందోళన నేపథ్యంలో లుగాన్క్ నుండి ఇప్పటి వరకు 51 వేల మంది ప్రజలను తరలించామని, వారిలో సగానికి పైగా చిన్నారులు ఉన్నారని తెలిపారు. కాగా, ఈ ఇరు రిపబ్లిక్‌లపై సైనిక దాడి జరగలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమర్ జెలెన్స్కీ చెబుతున్నారు.
మిస్స్క్ ఒప్పందం అంటే ఏమిటి
ఉక్రెయిన్ ప్రజల ఓటు ద్వారా ఎన్నుకున్న నాయకుడు విక్టర్ యునికోవిచ్‌కు వ్యతిరేకంగా పశ్చిమదేశాల మద్దతుతో 2013లో అనేక ఆందోళనకు జరిగాయి. ఆ ఆందోళనలు పెరిగి పెరిగి సైనిక కుట్ర జరిపి ప్రజల ద్వారా ఎనుకున్న నాయకుడు విక్టర్‌ను పదవిలోంచి తొలగించారు. ఈ సమయంలో డాన్‌బాస్ ప్రాంతంలోని డొనెట్క్స్, లుహాన్స్ ప్రాంతాలు స్వంతంత్య్ర దేశాలుగా ప్రకటించుకున్నాయి. ఆ సమయంలో ఈ రెండు ప్రాంతంలోని తిరుగుబాటు దారులతో ఉక్రెయిన్ సైన్యం యుద్దం చేసింది. కానీ గెలవలేకపోయింది. దీంతో శాంతి ఒప్పందానికి వచ్చింది. బెలారస్ రాజధాని మిస్స్క్ లో రష్యా, ఉక్రెయిన్, ఆ రెండు రిపబ్లిక్‌ల మధ్య 2014లో ఒప్పందం జరిగింది. కాల్పుల విరమణ పాటించాలని నిర్ణయించారు. కానీ ఆ తర్వాత ఉక్రెయిన్ ఈ రెండు ప్రాంతాలను కవ్విస్తూనే ఉంది. మిస్క్స్ ఒప్పందాలను ఉల్లంఘింస్తూ ఇటీవల ఈ రెండు రిపబ్లిక్‌లలో ఆ దేశాల పౌరుల పైకి తుపాకులను ఎక్కు పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు రిపబ్లిక్‌లు రష్యా సహకారం కోరడంతో ఉక్రెయిన్‌పైకి సైనిక చర్యకు రష్యా ఉపక్రమించింది.
రక్షణ, వాయు స్థావరాలు ధ్వంసం
డాన్‌బాస్ రిపబ్లిక్‌లు కోరిన నేపధ్యంలో రష్యా ఉక్రెయిన్‌పై స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించింది. స్వతంత్య్ర దేశాలుగా ప్రకటించిన డొనెట్క్స్, లుహాన్స్క్‌లపై ఉక్రెయిన్ లక్ష్యంగా చేసుకుని దాడి చేయనున్న నేపథ్యంలో ఆయా దేశాలకు రష్యా మద్దతుగా నిలుస్తోంది. ఉక్రెయిన్ చర్యను తిప్పికొట్టేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేక ఆపరేషన్ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. దీంతో రష్యా బలగాలు రంగంలోకి దిగాయి. ఉక్రెయిన్‌లోని రక్షణ, వాయు స్థావరాలను రష్యా బలగాలు ధ్వంసం చేస్తున్నాయి. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన జెలెన్స్కీ దేశంలో అత్యయిక పరిస్థితి ఏర్పాటు చేశారు. కాగా, ఇదే సమయంలో క్రెమ్లిన్ సరిహద్దుల్లో రష్యా కూడా సైనిక విమానాన్ని కోల్పోయిందని కీవ్ రక్షణ అధికారులు చేసిన వ్యాఖ్యలను మాస్కో రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. కాగా డాన్‌బాస్ ప్రాంతంలో రష్యా దళాలు ముందుకు కదులుతున్నాయి. ఉక్రెయిన్ రక్షణ, వాయు స్థావరాలను ద్వంసం చేస్తున్నాయి. కాగా ఉక్రెయిన్ సైనికులు రష్యా సేనలను ప్రతిఘటించకుండానే తప్పుకుంటున్నాయని రష్యా మీడియా సంస్థలు పేర్కొన్నాయి. కాగా రష్యా సేనలు కేవలం సైనిక స్థావరాలపైనే దాడులు చేస్తున్నాయని, ప్రజలు భయపడాల్సిందేమీ లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటన కూడా చేశారు.










