జమ్మలమడుగు రూరల్ : రాయలసీమ అనాదిగా వెనుకబడి ఉంది. పాలకులు ఎవరూ సీమ అభివృద్ధి గురించి పట్టించుకున్నపాపాన పోలేదు. ఏ ప్రాంతమైనా అభివృద్ధి జరగాలంటే వ్యవసాయంతో పాటు పరిశ్రమలు ఎంతో ముఖ్యం. వ్యవసాయం కాస్తా మూలనపడిపోయింది. పరిశ్రమలైనా వస్తాయనుకుంటే అవి కూడా ఆమడదూరంలో ఉంటున్నాయి. సీమ ప్రజల ఆకాంక్ష అయిన ఉక్కు పరి శ్రమతోనైనా ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు నిరుద్యోగ సమస్య తీరు తుందని భావించారు. ఎలాంటి ఉద్యమాలు లేకుండానే మనకు బ్రాహ్మణి రూప ంలో ఒక ఉక్కు పరిశ్రమ వచ్చింది. ఎంత వేగంగా వచ్చిందో అంతే వేగంగా రద్దర ుుపోయింది. చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డి నాలుగు సార్లు శంకుస్థాపనలు చేశారు. ప్రస్తుతం వాటి ఉనికే లేదు. ఉద్యమాల పుత్రికగా పేరుపొందిన విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ స్థాపనకు చేసినట్లుగా కడప ఉక్కు కోసం పోరాటాలు సాగించాలి. 'కడప ఉక్కు-రాయలసీమ హక్కు' అని ముక్తకంఠంతో నినదించాలి. ఢిల్లీ పాలకుల వెన్నులో వణుకు పుట్టించాలి. వారి మెడలు వంచి తాము కోరుకున్నది సాధించకోవాలి. భవి ష్యత్తరాల కోసం ఈ ప్రతిష్టాత్మక పరిశ్రమకు రూపకర్తలుగా మారాలి. ఉక్కు పరిశ్రమ స్థాప నకు రాయలసీమ ప్రజాప్రతినిధులు అందరూ ఏకం కావాల్సిన అవరం ఎంతైనా ఉంది.
విభజనతో గాయపడిన ఆంధ్రప్రదేశ్ దారు ణంగా మోసపోయింది. పదేళ్లుగా ప్రత్యేక హోదా దక్కు తుందన్న ఆశతో ఎదురుచూసిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మొండిచెయ్యే చూపింది. రాయలసీమలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు విభజన చట్టంలో హామీ ఇచ్చారు. రాయ లసీమలో కరువు ఎక్కువగా ఉంది. భూమి, ఖనిజ నిల్వలు విస్తారంగా ఉన్నాయి. ఉక్కు పరిశ్రమ స్థాపనకు అను కూల మని శ్రీకృష్ణ కమిటీ తమ నివేదికలో పేర్కొంది. సెయిల్ బృందం కూడా జిల్లాలో పర్యటించింది. ముడి ఖనిజాల లభ్యత, ఇనుము, డోలమైట్, పరిశ్రమ ఏర్పాటుకు స్థలం, నీరు, ట్రాన్స్‌పోర్టు తదితర అంశాలను పరిశీలించింది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కమిటీల మీద కమిటీలు వేసి చివరికి టాస్క్‌ఫోర్స్ కమిటీ పేరుతో ఎనిమిదేళ్లు కాల యాపన చేస్తోంది. ఎనిమిది బడ్జెట్‌లోనూ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న ఉక్కు పరిశ్రమ ఏర్పాటు హామీకి కాల దోషం పట్టించింది. విభజన చట్టం-2014లోని షెడ్యూల్ -13లో కడప సమీకృత ఉక్కు పరిశ్రమను ప్రత్యేకంగా ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఊసేలేదు.
ఖనిజాలకు ఖిల్లా.. పరిశ్రమలేవి?
కడప బేసిన్‌లో అరుదైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. కడపకు ఖనిజ నిక్షేపాల ఖిల్లాగా పేరుంది. ఉక్కుతో పాటు ఇతర పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. ఎన్ని తరాలు తవ్వినా తరగని సున్నపురాయి గనులు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యతధిక విస్తీరణంతో పాటు అరుదైన బెరైటీస్ మంగంపేటలో నిక్షేపమై ఉంది. బంగారం కంటే 50 రెట్లు విలువ చేసే పుల్లరిన్ ఉంది. ఇంకా ఎన్నోరకాల ఖనిజ నిక్షేపాలు జిల్లాలో విస్తారంగా ఉన్నాయి. వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. పరిశ్రమల స్థాపనకు అవసరమైన వనరులు మెండుగా ఉన్నాయి. ఇన్ని వనరులున్నా జిల్లాలో పరిశ్రమలు లేకపోవడంతో నిరుద్యోగులు ఉపాధిలేక ఇక్కడి నుంచి వేలాది మంది గల్ఫ్ దేశాలకు వలస వెళుతున్న దౌర్భాగ్యపు పరిస్థితి నెలకొంది.
వేగంగా వచ్చింది...అలాగే రద్దయింది
ఎలాంటి ఉద్యమాలు లేకుండానే మనకు బ్రహ్మణి రూపంలో ఒక ఉక్కు పరిశ్రమకు అనుమతి వచ్చి ంది. జిల్లాలో ఉక్కు పరిశ్రమకు అనుమతించడం వరం లాంటిదని అందరూ భావించారు. జిల్లాకు ఉక్కు కర్మా గారం వస్తుందని ఎవరూ ఊహించలేదు. పరిశ్రమకు అవ సరమైన భూములు, నీరు, ఇతర రాయితీలు చకచకా జరిగిపోయాయి. బళ్లారికి చెందిన ప్రారిశ్రామిక వేత్త గాలి జనా ర్థన్‌రెడ్డి ఇక్కడ పరిశ్రమ స్థాపనకు ముందుకు వచ్చారు. పద్దెనిమిది నెలల్లో 4,500 కోట్లతో రెండు మిలియన్ టన్నుల ఉత్పిత్తి సామర్థ్యంతో బ్రహ్మణి ఉక్కు పరిశ్రమను పూర్తి చేసి పది వేల మందికి ఉపాధి కల్పిస్తామని 2007 జూన్ పదవ తేదీన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఒఎంసి అక్రమాల కేసులో గాలి జైలుకెళ్లడంతో శాశ్వతంగా ఉక్కు పరిశ్రమకు తెరపడింది. ఎంత త్వరగా వచ్చిందో అంతే వేగంగా రద్దయిన విషయం తెలిసిందే.
ఉక్కు పరిశ్రమ జిల్లాలోనే ఎందుకు?
కడప జిల్లా ఆర్థికంగా, పారిశ్రామికంగా బాగా వెనుకుబడిన ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ విభజన ఉద్యమాల సందర్భంగా నియమించిన శ్రీ కృష్ణ కమిషన్ ప్రముఖంగా ప్రస్తావించిన ఒక అంశం రాయలసీమ వెనుకబాటు తనం గురించి. తెలంగాణ కంటే రాయ లసీమ అన్ని అభివృద్ధి సూచికల్లో వెనుకబడి ఉండటం శ్రీ కృష్ణ కమిషన్ తేల్చింది. అంత వెనుకబడిన ప్రాంతంలో నడిబొడ్డున ఉన్నది కడప జిల్లా నెల్లూరు, ప్రకా శంలతో కూడిన ఆరు జిల్లాలకు మధ్యన ఉంది. వెను కబాటుతనం పోవాలన్నా, ఉపాధి లభించాలన్నా, తద్వారా అభివృద్ధి జరగాలన్నా కావాల్సింది పరిశ్రమల స్థాపన. అందు కోసమే ఉక్కు పరిశ్రమ కావాలి. ముఖ్యంగా జిల్లాలో 500 మంది పనిచేసే ఒక్క పరిశ్రమ కూడాలేదు. జిల్లాకు వరం లాంటి ఉక్కు పరిశ్రమను కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మళ్లీ ఇక్కడ ప్రభుత్వ రంగంలోనే పరిశ్రమను స్థాపించాలనే ఉద్దేశం కూడా లేన ట్లుగా ఉంది. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే జిల్లాలో నేరుగా పది వేల మందికి పరోక్షంగా లక్షన్నర మందికి ఉపాధి లభిస్తుంది.
శంకుస్థాపనలపై శంకుస్థాపనలు
జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనలకు పాలకులు శంకుస్థాపనలపై శంకుస్థాపనలు చేసూకుంటూ పో తున్నారు. పరిశ్రమ నిర్మాణ పనలు మాత్రం కనీసం మచ్చుకు కూడా కనిపించడం లేదు. 2007 జూన్ 10న జమ్మలమడుగు మండల పరిధిలోని అంబవరం వద్ద బ్రా హ్మణి స్టీల్‌ప్లాంట్‌కు డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి, 2018 డిసెంబర్ 27న జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ముచ్చటగా మూడో సారి 2019 డిసెంబర్‌లో వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి జమ్మలమడుగు మండలం సున్న పురాళ్లపల్లె సమీ పంలో కన్యతీర్థం వద్ద శంకుస్థాపన చేశారు. ఆతర్వాత ఆయనే మళ్లీ నాల్గవ సారి ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ఉక్కు పరిశ్రమకు సున్నపురాళ్లపల్లె వద్ద భూమిపూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు చేసిందే కాని కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ ఊసే పట్టించుకోలేదు.
'ఉక్కు' పూర్తి చేయాలి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులతో సెయిల్‌ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి. ఇందుకు సంబంధించి పార్లమెంటు సాక్షిగా ప్రజాప్రతినిధులు హామీలిచ్చారు. విభజన హామీని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లి జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
- ఎం. మహేష్ గోపవరం కాలనీ, బద్వేల్
ఎన్నికల కోసమే..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కు పరిశ్రమను ఎన్నికల కోసమే ఉపయోగించుకుంటున్నాయి. నిరుద్యోగ యువతకు ఉపాధి చూపే చిత్తశుద్ధి ఇటు వైసిపికి కానీ, అటు కేంద్రంలోని బిజెపికి లేదు. ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోలేక తిరిగి జిల్లా ప్రజలను వంచిం చేందుకు జిందాల్ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఇంతవరకు పనులు ప్రారంభించడం లేదు.
-వీరనాల శివ కుమార్ డివైఎఫ్‌ఐ వైఎస్‌ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి
శిలాఫలకాలకే పరిమితం
ఉక్కు పరిశ్రమ నిర్మాణం సిఎం సొంత జిల్లాలో కేవలం శిలాఫలకాలకే పరిమితం కావడం దురదష్టకరం. లక్షలాది మంది నిరుద్యోగుల్లో కనీసం వేలాది మందికైనా ఉపాధి లభిస్తుందని ఆశతో ఎంతోమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఉక్కు పరిశ్రమపై చిన్నచూపు చేస్తున్నాయి. పరిశ్రమను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి చూపించాలి
-తోట శివశంకర్, నిరుద్యోగి, నందలూరు
ఉపాధి అవకాశాలకు గండి
రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఆంధ్ర ప్రదేశ్ లో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాల్సి ఉండగా పదేళ్లు గడుస్తున్నా అధికారంలో ఉన్న బిజెపి ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో నిరుద్యోగ యువత ఉపాధికి గండి పండింది. దీనివల్ల రాష్ట్రంలో చదువుకున్న యువత ఉపాధి కోసం బెంగళూరు, హైదరాబాద్, చెన్నైకి వలస వెళ్తున్నారు.
- ఎస్. ఖదీర్, నిరుద్యోగి కలికిరి.










