మాట్లాడుతున్న కలెక్టర్
ఉగాది నాటికి ఇళ్లు పూర్తి చేయాలి
కొడవలూరు:జిల్లాలో ఇల్లు లేని పేదవారు ఉండకూడదనే బహత్తర లక్ష్యంతో పనిచేస్తున్నామని కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు.
మంగళవారం బుచ్చిరెడ్దిపాలెం మండలంలోని కట్టుబడివారిపాలెం జగనన్న కాలనీల్లో నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయుటకు ప్రతి శనివారం హౌసింగ్ డే గా నిర్ణయించి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. సచివాలయ స్థాయిలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్ నుంచి జిల్లా స్థాయి అధికారి, ప్రత్యేక అధికారుల వరకు గహ నిర్మాణ శాఖకు సంబంధించిన అధికారులందరూ పాల్గొని పనులు వేగవంతం చేయుటకు కషి చేయాలన్నారు. గహ నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులకు ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తూ ఎటువంటి పెండింగు లేకుండా చూస్తున్నామన్నారు. అదేవిధంగా గహ నిర్మాణానికి వడ్డీలేని రుణాన్ని అందిస్తున్నామన్నారు. పేద ఎస్‌టి కుటుంబాలకు సిఎస్‌ఆర్ నిధుల నుంచి అదనపు నగదు మంజూరు చేస్తున్నామన్నారు. ఈ సౌకర్యాలను లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకొని ఇళ్లు పూర్తి చేసుకోవాలన్నారు. కొత్తగా నుడా పరిధిలోకి వచ్చిన వారికి కూడా ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 63 వేల మందికి ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇంకా ఎవరైనా ఇంటి కొరకు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేస్తామన్నారు. ఇళ్లు నిర్మాణం పూర్తయిన వెంటనే ఆయా కాలనీలలో అంతర్గత మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. రాబోవు ఉగాది నాటికి గహప్రవేశం చేయడానికి లబ్ధిదారులకు సహకారం అందిస్తామన్నారు.కార్యక్రమంలో కలెక్టర్ వెంట నియోజకవర్గ ప్రత్యేక అధికారి సుధాకర్, బుచ్చి నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీవో నరసింహారావు, తహశీల్దార్ పద్మజలు ఉన్నారు.










