అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్
ఉగాది నాటికి గృహప్రవేశాలు
నెల్లూరు:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలు- పేద లందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా జగనన్న కాలనీల్లో చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి ఉగాది నాటికి గహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ కె.వి.ఎన్ చక్రధర్ బాబు, సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం నగర పరిధిలోని వెంకటేశ్వరపురం వద్ద, అక్కచెరువుపాడు వద్ద జగనన్న కాలనీలలో చేపట్టిన ఇళ్ళ నిర్మాణాల పురోగతిని ఆయన పరిశీలించారు. ముందుగా కలెక్టర్ వెంకటేశ్వర పురం వద్ద జగనన్న కాలనీలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల పురోగతిని పరిశీలించారు. ఈ ప్రాంతంలోని లే అవుట్ లో మొత్తం 769 ఇళ్ల మంజూరు కాగా, అందులో బిలో బేస్మెంట్ స్థాయిలో 96, బేస్మెంట్ స్థాయిలో 379, లింటల్ లెవెల్ లో 35, రూఫ్ లెవెల్ లో 14, రూఫ్ కాస్ట్ లో 245 గహాలు ఉన్నాయని గహనిర్మాణ శాఖ అధికారులు కలెక్టర్ కు వివరించారు. గహ నిర్మాణాల పురోగతిపై జిల్లా కలెక్టర్ అసంతప్తిని వ్యక్తం చేస్తూ వివిధ దశల్లో వున్న ఇళ్ల నిర్మాణాలను ఉగాది నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒక నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలని తద్వారా లక్ష్యాలను పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి ఎప్పటికప్పుడు స్టేజీ అప్డేషన్ చేయాలన్నారు. రోజువారీ లక్ష్యాలను నిర్ధేశించుకొని ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయుటకు అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇళ్ల నిర్మాణాలతో పాటు జగనన్న కాలనీల్లో విద్యుత్, సైడు కాలువలు, త్రాగునీరు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దష్టి సారించాలని అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అక్కచెరువుపాడు వద్ద గల జగనన్న జగనన్న కాలనీలో చేపట్టిన ఇళ్ళ నిర్మాణాల పురోగతిని పరిశీలించి, ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమీషనర్ హరిత, ఆర్.డి.ఓ మాలోల, హౌసింగ్ పి డి వెంకట దాసు, హౌసింగ్ శాఖ, విద్యుత్ శాఖ అధికారులు, సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.










