ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని సిఎం
ప్రజాశక్తి-కావలి : పరిపాలన చేయటం చేతకాక ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లపై మాట్లాడటం సిగ్గుచేటు అని జనసేన కావలి నియోజకవర్గ ఇన్‌ఛార్జి అళహరి సుధాకర్, జిల్లా కార్యదర్శి సమ్మను వెంకటసుబ్బయ్య విమర్శించారు. శనివారం పట్టణంలోని ''జర్నలిస్ట్ క్లబ్''లో వారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఎన్ని మూడు పెళ్లిల్లు చేసుకున్నాడంటూ పదేపదే ప్రశ్నిస్తున్నాడని తెలిపారు. జగన్మోహన్‌రెడ్డికి ముత్తాత రెండు పెళ్లిల్లు, తాత రాజారెడ్డి రెండు పెళ్లిల్లు, చెల్లెలు రెండు పెళ్లిల్లు చేసుకున్న విషయంతెలియదా అని ప్రశ్నించారు. పార్టీలో తల్లికి, చెల్లికి న్యాయం చేయక తరిమేసిన ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను విమర్శించటం హస్యాస్పదమన్నారు. ఇప్పటికే జనసేన పార్టీ ప్రజల వైపు ఉండి అనేక సమస్యలపై పోరాడుతుందని, రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావటం ఖాయమన్నారు. సొంత డబ్బులతో ప్రజలకు సాయం చేసిన ఘనత పవన్‌కల్యాణ్‌కే దక్కిందన్నారు. రాబోయేరోజుల్లో కావలి నియోజకవర్గంలో కూడా జనవరి నెలలో పండగలు అయిపోయిన వెంటనే నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పార్టీని ముందుకు తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు పొబ్బా సాయివిఠల్, ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆలా శ్రీనాథ్, గౌరవ అద్యక్షడు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, జనసైనికులు చంటి, వెంకయ్య, లక్మణ్, ఖాలేషా, మదన్, బాస్కర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.










