పుట్టపర్తి అర్బన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల ముఖ హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని కలెక్టర్ బసంత్‌కుమార్ సూచించారు. బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి కార్యదర్శి ముత్యాల రాజు సిఎఫ్‌ఎంఎస్ అధికారి సునీల్ రెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ ఆధారిత హాజరుపై వర్చువల్ విధానంలో సమీక్షించారు. స్థానిక కలెక్టరేట్లోని స్పందన వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ బసంత కుమార్, అడిషనల్ ఎస్పీ రామకష్ణ ప్రసాద్, డిఆర్‌ఒ కొండయ్య, సంబంధిత జిల్లా అధికారు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ ఆధారిత హాజరు అమలులో భాగంగా ఎఫ్‌ఆర్‌ఎస్ యాప్‌లో నమోదు కాకుండా ఇంక మిగిలి ఉన్న ఉద్యోగులు అందరూ సత్వరమే ఆ యాప్‌లో నమోదు చేసుకోవాలన్నారు. దీని బాధ్యతను సంబంధిత డిడిఒలు తీసుకోవాలన్నారు. ఎక్కువ సిబ్బంది ఉన్న శాఖలు జిల్లా పంచాయితీ అధికారి, పంచాయితీ రాజ్ ఇంజినీరింగ్, మున్సిపల్ శాఖ, అటవీ శాఖ, రెవెన్యూ తదితర శాఖలు ఈ అంశంపై ప్రత్యేక దష్టి సారించి పూర్తి చేయాలని సూచించారు. ముఖ ఆధారిత హాజరు యాప్ నందు నమోదు మరియు హాజరు 80 శాతం శాఖలలో పూర్తి అయిందని, దానిని వంద శాతం తప్పక అమలు చేయాలన్నారు. సిబ్బంది అందరూ ఉదయం సాయంత్రం ముఖ ఆధారిత హాజరు నమోదు చేయాలని తెలిపారు. ఏదదైనా సాంకేతిక సమస్యలు, సందేహాలు ఉంటే ఎన్‌ఐసి సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. ఈ సమీక్షలో డిఆర్‌డిఎ పీడీ నరసయ్య, డిపిఒ విజరు కుమార్, డ్వామా పీడీ రామాంజనేయులు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రషీద్ పాల్గొన్నారు.










