ప్రజాశక్తి -కందుకూరు :కార్పొరేట్ రంగంలో ఈ ఏడాది ఉద్యోగ నియామకాల సంక్షోభం నెలకొని ఉన్నా ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు పలువురు టి.సి.ఎస్‌లో ఉద్యోగాలకు ఎంపికైన తమ ప్రతిభను చాటుకున్నారని కరస్పాండెంట్ కంచర్ల రామయ్య, సాంకేతిక డైరెక్టర్ డాక్టర్ కే.విజయ శ్రీనివాస్ గురువారం వెల్లడించారు. టిసిఎస్‌తోపాటు డిలాయిట్ కంపెనీకి కూడా ఒక విద్యార్థి ఎంపిక కావడం తమ కాలేజీ సమర్థతకు తార్కాణమన్నారు. టిసిఎస్‌కు ఎంపికైన వారిలో ఒక విద్యార్థి రూ. 7 లక్షల వార్షిక వేతనం క్యాటగిరిలో ఉండడం తమకు ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. తొలి విడతలో 15 మంది టిసిఎస్‌కు ఎంపిక కాగా, మరో 10 మంది విద్యార్థులు వివిధ దశల అనంతరం ఫైనల్ గా ఎం.ఆర్ ఇంటర్వ్యూ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని టెక్నికల్ డైరెక్టర్ డాక్టర్ విజరు పేర్కొన్నారు. సంక్షోభ నివారణ ముగిసిన అనంతరం పలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగాలు ఎంపికకు రంగ ప్రవేశం చేసే అవకాశాలు దక్కించుకునేందుకు ప్రణాళిక రూపొందించామని వారు వెల్లడించారు. టెక్నికల్ సపోర్ట్ జాబ్స్‌కు క్యాంపస్ ఇంటర్వ్యూల నిర్వహణ రంగ సిద్ధం చేస్తున్నామన్నారు. విప్రో,ఇన్ఫోసిస్, కేప్ జెమినీ తదితర కంపెనీల త్వరలో క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు.










